మార్పులతో ప్రీమియం భారం, హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు అలా చేయవద్దు!
ప్రస్తుత హెల్త్ ఇన్సురెన్స్ పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని బీమా నియంత్రణ సంస్థ IRDAI.. ఆరోగ్య బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మార్పులు చేస్తే బీమా ప్రీమియంలు పెరగవచ్చునని, అప్పుడు పాలసీదారులు ఇబ్బందిపడతారని పేర్కొంది. వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రయాణ బీమా కవరేజీల జోలికీ వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న బీమా ప్రయోజనాలను సవరించడానికి, ప్రస్తుత ఉత్పత్తుల్లో కొత్త ప్రయోజనాలు జోడించేందుకు అనుమతించడం లేదని జనరల్, స్టాండాలోన్ హెల్త్ ఇన్సురర్స్‌ను ఆదేశించింది. ఎందుకంటే ఇది ప్రీమియం పెరుగుదలకు దారి తీస్తుందని పేర్కొంది.

పాలసీదారు అంగీకారంపై
హెల్త్ ఇన్సురెన్స్ బిజినెస్‌లో ప్రోడక్ట్ ఫైలింగ్ పైన కన్సాలిడేటెడ్ గైడ్‌లైన్స్ ప్రకారం చిన్నచిన్న మార్పులను అమలు చేయడానికి బీమా సంస్థలకు అనుమతి ఉంది. ఈ మేరకు గత ఏడాది జూలైలో దీనిని జారీచేశారు. అంటే ఆరోగ్య బీమా వ్యాపారంలో పాలసీల కోసం గత జూలై నెలలో జారీ చేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకునేలా అనుమతినిచ్చింది. పాలసీదారుల అంగీకారంపై స్టాండాలోన్ ప్రీమియం రేటుతో ప్రస్తుత ప్రయోజనాలకు కొత్త వాటిని జత చేసుకోవచ్చునని బీమా సంస్థలకు సూచించింది.

హెల్త్ ఇన్సురెన్స్ ఉత్పత్తి..
పాలసీల లాభాలు కస్టమర్లందరికీ సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాలని ఇన్సూరెన్స్ సంస్థలకు Irdai సూచించింది. ప్రతి హెల్త్ ఇన్సురెన్స్ ఉత్పత్తి ఫైనాన్షియల్ వయబిలిటీని సమీక్షించేందుకు యాక్చువరీస్‌ను నియమించాలని సూచించింది. ప్రతి ఉత్పత్తిని సమీక్షించి, పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సిఫార్సులు చేయాలని పేర్కొంది.

FDI పరిమితి
ఇదిలా ఉండగా, బీమా రంగంలో FDI పరిమితిని 74 శాతానికి పెంచేందుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి FDI పెంపు దోహదపడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు.


Click it and Unblock the Notifications