Bulls Stock: ఐపీవో తర్వాత 200 శాతం పెరిగిన స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల కీలక సూచన
Doms Industries Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలను నమ్ముకున్న చాలా మంది ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో లాభాలను ఆర్జించారు. మధ్య కాలిక నుంచి దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించిన చాలా మంది పెట్టుబడులు రెండు నుంచి మూడింతల రాబడిని అందుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది DOMS ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఐపీవోగా ఈక్విటీ మార్కెట్లలో అడుగుపెట్టిన కంపెనీ స్టాక్ మార్కెట్‌లో అద్భుత పనితీరుతో సూపర్ రాబడిని అందించింది. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ స్టాక్ దలాల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్ గా మారింది. నిపుణులు సైతం కంపెనీ షేర్లపై బులిష్ వ్యూ కలిగి ఉన్నారు. వివిధ బ్రోకరేజ్ సంస్థలు BUY రేటింగ్ అందిస్తున్నారు.

నేడు కంపెనీ షేర్లు ఉదయం ఒక్కోటి రూ.2255.05 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. 5 శాతం పెరిగుదలతో బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.2367.50కి చేరుకున్నాయి. గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 75 శాతం పెరిగాయి. వాస్తవానికి గత ఏడాది కంపెనీ షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లోకి ఐపీవో ద్వారా అరంగేట్రం చేశాయి. డిసెంబర్‌లో కంపెనీ లిస్టైంది. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ ధర ఒక్కోటి రూ.790 ఉండగా అప్పటి నుంచి కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లు ఏకంగా 200 శాతం రాబడిని అందించాయి.
దేశీయ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.2670గా నిర్ణయించింది. వాస్తవానికి పేర్కొన్న టార్గెట్ ధర ప్రస్తుత స్థాయి కంటే దాదాపు 20 శాతం అధికం. ప్రస్తుతం బ్రోకరేజ్ డోమ్స్ కంపెనీ షేర్లకు 'బై' ట్యాగ్‌ని ఇచ్చింది. అలాగే 2024 నుంచి 2027 వరకు ఆదాయం, EBIRDA, CAGR వరుసగా 25 శాతం, 26 శాతం, 28 శాతంగా ఉండవచ్చని బ్రోకరేజ్ తన అంచనాలను పంచుకుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 75 శాతం వాటా కలిగి ఉన్నారు. అలాగే SBI మ్యూచువల్ ఫండ్స్ సైతం కంపెనీలో వాటాలను హోల్డ్ చేస్తోంది. మార్చి త్రైమాసికం నాటికి కంపెనీలో SBI మ్యూచువల్ ఫండ్స్ 7.1 శాతం వాటాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications