LPG Prices: ఆదివారం ఉదయమే సామాన్యుడికి గట్టి షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు!

ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరో భారం పడింది. ఆదివారం ఉదయమే దేశీయ వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు గట్టి షాక్ తగిలింది. లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన చేదు వార్త మరవకముందే.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

గత మూడు నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. మిడిల్ ఈస్ట్‌లో (మధ్య ప్రాచ్యం) జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరా ఖర్చులు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ తాజా నిర్ణయంతో గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరపై ఇప్పుడు ఏకంగా రూ.29 పెరిగింది.

Domestic LPG Cylinder Prices Up By Rs 29 Check Cooking Gas Cost In Your City LPG Prices

తాజా రేట్లు ఇవే (City-Wise LPG Prices)

ఈ పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో లేటెస్ట్ LPG prices (ఎల్‌పీజీ ధరలు) ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం

  • హైదరాబాద్: గతంలో రూ. 967 గా ఉన్న సిలిండర్ ధర, ఇప్పుడు రూ. 29 పెరిగి రూ. 996 కి చేరింది.
  • ఢిల్లీ: పాత ధర రూ. 913 ఉండగా.. తాజా పెంపుతో ఇప్పుడు రూ. 942 కి చేరింది.
  • ముంబై: ముంబైవాసులకు గతంలో రూ. 912.50 కి లభించిన సిలిండర్, ఇప్పుడు రూ. 941.40 అయింది.
  • కోల్‌కతా: ఇక్కడ పాత ధర రూ. 939 కాగా.. ఇప్పుడు అది ఏకంగా రూ. 968 కి పెరిగింది.
  • చెన్నై: గతంలో రూ. 928.50 ఉండగా.. ప్రస్తుత ధర రూ. 957.50 కి చేరుకుంది.
  • బెంగళూరు: బెంగళూరులో పాత ధర రూ. 915.50 ఉండగా.. ఇప్పుడు రూ. 944.50 కి విక్రయిస్తున్నారు.
  • పాట్నా: ఇక్కడ సిలిండర్ ధర అత్యధికంగా రూ. 1002.50 నుండి ఏకంగా రూ. 1031.50 కి చేరింది.

అసలు ధర రూ.1,600 పైనే.. కానీ!

పెట్రోలియం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీలు, రవాణా ఖర్చులు కలగలిపి ప్రస్తుతం ఒక సిలిండర్ సరఫరా చేయడానికి ప్రభుత్వానికి సుమారు రూ.1,600 నుంచి రూ.1,700 వరకు ఖర్చవుతోంది. అయినప్పటికీ, 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' (PMUY) పథకం కింద భారతీయ కుటుంబాలకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ ధరకే వంటగ్యాస్ అందుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 10.35 కోట్లకు పైగా ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి.

ప్రభుత్వ భారం.. నిధుల విడుదల

ప్రపంచవ్యాప్తంగా సరఫరాకు అంతరాయం కలిగినప్పటికీ, 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' గుండా ఇంధన రవాణాను సురక్షితంగా కొనసాగించిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంటగ్యాస్‌పై ఏకంగా రూ.60,000 కోట్ల భారాన్ని మోశాయి. ఈ నష్టాల నుంచి కంపెనీలను ఆదుకోవడానికి కేంద్ర బడ్జెట్ నుంచి రూ.30,000 కోట్ల నష్టపరిహారాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+