న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణం ఇక మరింత భారం కానుంది. డొమెస్టిక్ విమాన ప్రయాణాల ఛార్జీలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సవరించింది. ఛార్జీల్లో 13 నుంచి 16 శాతం మేర పెంచింది. పెరిగిన విమాన ఛార్జీలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుదల భారాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ ప్రయాణికులపైనే మోపింది. లోయర్ క్లాస్‌కు మాత్రమే వర్తింపజేసింది. ధనిక, ఉన్నత వర్గాలు రాకపోకలు సాగించే అప్పర్ క్లాస్ ఛార్జీల పెంపుదల జోలికి వెళ్లలేదు. పెంపుదల నుంచి ఆ క్లాస్‌ను మినహాయించింది. వాటి ఛార్జీల్లో ఎలాంటి సవరణలు చేయలేదు. అవి యధాతథంగా కొనసాగుతాయి.

కరోనా ఎఫెక్టే..
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్ల దేశీయ విమానయాన సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న కారణంగా ఛార్జీలను పెంచినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజాగా చేసిన సవరణల ప్రకారం.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఇదివరకు 2,300 రూపాయల ఛార్జీని చెల్లించాల్సి ఉండగా.. జూన్ 1వ తేదీ నుంచి 2,600 రూపాయలను కట్టాల్సి ఉంటుంది. 40 నుంచి 60 నిమిషాల విమాన ప్రయాణానికి ఇకపై ప్రయాణికులు చెల్లించాల్సిన ఛార్జీ ధర 3,300 రూపాయలు. ప్రస్తుతం ఇది 2,900 రూపాయలుగా ఉంటోంది.

పెంపు ఇలా..
విమాన ప్రయాణ సమయం 60-90, 90-120,120-150, 150-180, 180-210 నిమిషాలను ప్రాతిపదికగా తీసుకుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఛార్జీల మోత మోగించింది. దీని ప్రకారం.. ఒక్కో లోయర్ క్లాస్ ప్రయాణికుడిపై 4,000, 4,700, 6,100, 7,4,00, 8,700 రూపాయల మేర భారం పడుతుంది. ప్రస్తుతం ఆయా ప్రయాణ సమయానికి విమానయాన సంస్థలు వసూలు చేస్తోన్న ఛార్జీలు 3,500, 4,100, 5,300, 6,400, 7,600 రూపాయల మేర ఉంటోంది.

80 శాతం ఆక్యుపెన్సీకి వీలు..
దీనితోపాటు 80 శాతం ఆక్యుపెన్సీకి కూడా అనుమతి ఇచ్చినట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో సీట్ల భర్తీ 50 శాతం మాత్రమే. జూన్ 1 నుంచి 80 శాతం మేర సీట్లను భర్తీ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఆక్యుపెన్సీ శాతాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించడం, లోయర్ క్లాస్ రేట్లు పెంచడం వంటి చర్యల వల్ల విమానయాన సంస్థలు ఆర్థిక సుడిగుండాల నుంచి బయటపడతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరో నెల నిషేధం..
కాగా- అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో నెల వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం వచ్చేనెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కార్గో విమాన సర్వీసుల సేవలు మాత్రం దేశీయంగా, అంతర్జాతీయంగా యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా- ఈ నెల చివరి నాటికి కూడా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతలో ఆశించిన స్థాయిలో తగ్గుదల కనపర్చకపోవడం వల్లే అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని పొడిగించాల్సి వచ్చిందని కేంద్రం పేర్కొంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications