కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన నేపథ్యంలో విమాన సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే డొమెస్టిక్ ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ సెప్టెంబర్ నెలలో 2 శాతం నుండి 3 శాతం పెరిగి 68 లక్షల నుండి 69 లక్షలుగా నమోదయిందని ఇక్రా వెల్లడించింది. గత నెలలో ప్లేన్ డిప్లాయిమెంట్ 54 శాతం పెరిగింది. సెప్టెంబర్ నెలలో రికవరీ పుంజుకున్న సంకేతాలు మరింతగా కనిపించాయని, అయితే రికవరీ ఉన్నప్పటికీ కరోనా ముందుస్థాయితో పోలిస్తే ప్రయాణీకుల రద్దీ 38 శాతం తక్కువే ఉందని పేర్కొంది.
కార్పోరేట్ ట్రావెలర్ విభాగం డిమాండ్ తగ్గిపోతున్నట్లు తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ నెల ప్రాతిపదికన 2 శాతం నుండి 3 శాతం, ఏడాది ప్రాతిపదికన 74 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

ప్రయాణీకుల సంఖ్య
సెప్టెంబర్ ఎయిర్ లైన్స్ కెపాసిటీ డిప్లాయిమెంట్ ఏడాది ప్రాతిపదికన దాదాపు 54 శాతం పెరిగి, 61,000కు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఇది 39,628గా నమోదయింది. సగటు రోజువారి డిపార్చర్స్ సెప్టెంబర్ నెలలో 2100గా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో 1321గా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ నెల 1900తో పోల్చినా పెరిగింది. ఒక విమానానికి సగటు పాసింజర్స్ ఆగస్ట్ నెలలో 117 కాగా, సెప్టెంబర్ నెలలో 113కు తగ్గింది.

విమానయాన నష్టం
కరోనా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ విమాన పరిశ్రమ భారీ నష్టాలను నమోదు చేస్తోంది. 2020-2022 మధ్య కాలంలో పరిశ్రమకు రూ.15 లక్షల కోట్ల నష్టం వస్తుందని అంతర్జాతీయ విమానయాన సంస్థల అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్సుపోర్ట్ అసోసియేషన్(IATA) అంచనా వేసింది. అయితే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, సంక్షోభ తీవ్రత నుండి బయటపడుతున్నామని, కోలుకునే దిశగానే పయనిస్తున్నామని IATA డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన IATA 77వ వార్షిక సదస్సులో వాల్స్ మాట్లాడారు.
2020లో 138 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని, 2021లో 52 బిలియన్ డాలర్ల మేర తగ్గనుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2022లో నష్టాలు 12 బిలియన్ డాలర్లకు తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

భారత్‌లో 70 శాతం అందుబాటులోకి
మొత్తం ఈ కాలంలో 201 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చునని, అంటే మన కరెన్సీలో రూ.15 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చునని చెబుతున్నారు. 2023లో పరిశ్రమ లాభాల బాట పడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ విమాన పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 472 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని, గత ఏడాదితో పోలిస్తే 26.7 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని IATA వర్గాలు చెబుతున్నాయి.
2022లో ఆదాయం 39.3 శాతం వృద్ధితో 658 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేసింది. ఇక, భారత్ విషయానికి వస్తే గత ఏడాది మార్చి 23వ తేదీ నుండి విమాన సేవలు నిలిచిపోయాయి. కరోనా తగ్గిన తర్వాత సేవలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, అంతర్జాతీయ సేవల రద్దు కొనసాగుతోంది. దేశీయంగా పలు ఆంక్షలు కొనసాగాయి.
దీంతో ప్రస్తుతం కరోనా ముందుస్థాయితో పోలిస్తే 70 శాతం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ బబుల్ ఒప్పందాల్లో భాగంగా 28 దేశాలకు మాత్రం ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. కరోనా ముందుస్థాయితో పోలిస్తే ఇది 20 శాతమే.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications