మీ సిద్ధాంతాలు పక్కనపెట్టండి.. ఇది సహించకూడదు: ఆనంద్ మహీంద్రా
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో దుండగుల దాడిపై దేశవ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనపై రాజకీయ పక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ఘటనపై వ్యాపార వర్గాలు కూడా స్పందించాయి. మహింద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ఈ ఘటనపై ట్వీట్ చేశారు.
రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టి, హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. మీ రాజకీయాలు ఏమిటి, మీ సిద్ధాంతాలు ఏమిటి, నమ్మకాలు ఏమిటి అనేది ఇక్కడ విషయం కాదని, కానీ మీరు భారతీయులు అయితే సాయుధ, చట్టవిరుద్ధమైన గూండాలను ఎప్పటికీ సహించకూడదని పేర్కొన్నారు. JNU విశ్వవిద్యాలయంలో దాడి చేసిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు.

మరో పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడి క్షమించరాని చర్య అన్నారు. హింసను ఎప్పటికీ సహించకూడదన్నారు. బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయి, ఢిల్లి లెఫ్టినెంట్ గవర్నర్, కీర్తి సనన్ తదితరులు స్పందించారు.
జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి తీవ్రమైన అంశమని, చర్చలు, ఒపీనియన్లతో ముందుకు రావాలని, హింస మాత్రం మార్గం కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.


Click it and Unblock the Notifications