ప్రపంచంలో బంగారానికి ఉన్న విలువ చాలా ఎక్కువేనని చెప్పుకోవచ్చు. పసిడి పెట్టుబడికి మాత్రమే కాదు అలంకారానికి కూడా ఉపయోగిస్తుంటారు. భావోద్వేగానికి ప్రతీకగా బంగారం నిలుస్తూ ఉంటుంది. మన దేశంలో అయితే బంగారం ఆభరణంగా మాత్రమే చూడకుండా ఓ విలువైన ఆస్తిగా చూస్తారు. సాధారణంగా బంగారం ధర స్థిరంగా ఉండడం లేదా పెరగడం వల్ల పెట్టుబడిదారులు దానిని సురక్షితమైన డిమాండ్ గా పరిగణిస్తుంటారు.
అయితే ఇదే సమయంలో చాలామందిని బంగారం గురించి ఓ ప్రశ్న వేధిస్తూ ఉంటుంది.అదేంటంటే.. బంగారం నిజంగా పాడవుతుందా..అంటే అది తుప్పు పడుతుందా.. సంవత్సరాల తరబడి పసిడిని వాడకుండా అలాగే ఉంచితే దాని మెరుగు పోతుందా.. ఈ ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి. దీనికి బంగారం నిపుణులు సమాధానాలు ఇస్తున్నారు. వారి ప్రకారం.. బంగారం పూర్తిగా నోబుల్ మెటల్.. అంటే ఇది రసాయనిక చర్యలకు చాలా తక్కువగా లోనవుతుంది. మిగతావన్నీ రస్ట్ (ఐరన్ ఆక్సైడ్)తో కూడి ఉంటాయి. ఇనుము లేదా ఇనుముతో చేసిన మిశ్రమాలు మాత్రమే ఇలా రస్ట్ అవుతాయి. గాలి, తేమ కారణంగా ఇనుము ఆక్సిజన్‌తో కలసి ఫెరిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఇనుము తుప్పుపట్టిపోతుంది. దీనినే మన భాషలో రస్ట్ అని పిలుస్తాం.

ఇక బంగారం అణువులు చాలా స్థిరంగా ఉంటాయి. కాబట్టి గాలి, నీరు లేదా సాధారణ ఆమ్లాల ప్రభావానికి అవి లోనవవు.బంగారం సాధారణ పరిస్థితుల్లో కూడా ఆక్సిడైజ్ కాదు.పసిడిని ప్రత్యేక ఆమ్లం తప్ప మరే లోహం కరగించలేదు. నైట్రిక్ యాసిడ్ + హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిశ్రమంలో మాత్రమే పసిడి కరుగుతుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ తన మెరుపును కోల్పోదు. రస్ట్ కు గురకాదు. అందుకే శతాబ్దాలుగా భూమిలో పాతిపెట్టిన బంగారు నాణేలు పాడవకుండా ఉంటాయి. ఆభరణాలు తవ్విన తర్వాత కూడా మెరిసిపోతూ ఉంటాయి.
అయితే కొన్ని సందర్భాల్లో బంగారం రంగు మారుతూ ఉంటుంది. కొన్ని ఆభరణాలపై పసుపు-పచ్చ పొర ఏర్పడుతుంది. అయితే దీన్ని రస్ట్ గా పరిగణించకూడదు. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు బంగారం ఆభరణాలలో కాపర్, సిల్వర్ మిశ్రమంగా ఉంటాయి. కాపర్ వాయువులోని సల్ఫర్‌తో చర్యచేసినట్లైతే బంగారం రంగు మార్చుతుంది.అందుకే పసిడి పచ్చగా కనిపిస్తుంది. అంతే తప్ప అది రంగు మారినట్లు కాదు. అయితే ప్యూర్ గోల్డ్ అయిన 24 క్యారెట్ల Gold ఎప్పటికీ రంగు మారదు. మిగతా క్యారెట్లు రంగు మారుతుంటాయి. బంగారం ఎంతకాలం నిల్వ చేసినా పాడవుదు. దాన్ని వాడినా, వాడకపోయినా రసాయనికంగా అది మారదు. అయితే ధూళి, చెమట వల్ల GOld మసకబారవచ్చు. దాన్ని క్లీన్ చేస్తే మళ్లీ బంగారం దానందట అదే మెరిసిపోతుంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications