వీసా రిజెక్ట్ అవుతుందా? మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) కి, వీసాకి ఉన్న అసలు లింక్ ఇదే!
ఉద్యోగం కోసమో, చదువు కోసమో లేదా సరదాగా తిరగడానికో విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, ఫారిన్ వెళ్లాలంటే అన్నింటికంటే ముఖ్యమైన మొదటి అడుగు-వీసా (Visa) రావడం. వీసా ప్రాసెస్ అనగానే మన ఐడెంటిటీ, ప్రయాణ ఉద్దేశం, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటి చాలా విషయాలను అధికారులు చెక్ చేస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలామంది మైండ్‌లో ఒక డౌట్ తిరుగుతోంది. అదేంటంటే-"మన సిబిల్ స్కోర్ (CIBIL Score) లేదా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే వీసా రిజెక్ట్ అవుతుందా?" అని.
దీనికి సింపుల్‌గా చెప్పే సమాధానం-'లేదు'. మీ క్రెడిట్ స్కోర్ బాగుందా లేదా అనే దాన్ని బట్టి వీసా అప్రూవల్ లేదా రిజెక్షన్ అనేది జరగదు. ఏ దేశంలో కూడా "వీసా కావాలంటే కచ్చితంగా 750 లేదా 800 క్రెడిట్ స్కోర్ ఉండాలి" అనే రూల్ ఎక్కడా లేదు.

ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏం చూస్తారు?
మీరు వీసా కోసం అప్లై చేసినప్పుడు అక్కడి అధికారులు మీ సిబిల్ స్కోర్‌ని డైరెక్ట్‌గా చూడలేరు, వాటిని చెక్ చేయరు కూడా. ముఖ్యంగా టూరిస్ట్ వీసాల కోసం చూసేది ఏంటంటే-మీ ఆదాయపు ఆధారాలు (Income proof), బ్యాంక్ బ్యాలెన్స్, మీరు చేస్తున్న ఉద్యోగం లేదా బిజినెస్ వివరాలు, మీ ప్రయాణ పత్రాలు మాత్రమే. మీరు మళ్లీ మన దేశానికి తిరిగి వచ్చేస్తారా లేదా అని మాత్రమే వాళ్లు చూస్తారు.
మరి క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం?
నేరుగా వీసా ఇవ్వడానికి క్రెడిట్ స్కోర్ అవసరం లేకపోయినా, పరోక్షంగా (Indirectగా) ఇది మీకు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
• లాంగ్ టర్మ్ వీసాలు: మీరు స్టడీ వీసా, వర్క్ పర్మిట్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ (PR) కోసం అప్లై చేసినప్పుడు కొన్ని దేశాలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని లోతుగా పరిశీలిస్తాయి. అలాంటి సమయంలో మీ ఫైనాన్షియల్ రికార్డ్ క్లీన్‌గా ఉంటే మీ ప్రొఫైల్‌కి మంచి వాల్యూ పెరుగుతుంది.
• మంచి ఇంప్రెషన్: సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే, మీరు గతంలో తీసుకున్న లోన్లు కరెక్ట్‌గా కట్టారని అర్థం. ఇది మీపై ఒక నమ్మకాన్ని, మంచి ఇంప్రెషన్‌ను కలిగిస్తుంది.
• ట్రావెల్/ఎడ్యుకేషన్ లోన్స్: విదేశాలకు వెళ్లడానికి చాలామంది ఎడ్యుకేషన్ లోన్ లేదా ట్రావెల్ లోన్ తీసుకుంటారు. మీ క్రెడిట్ స్కోర్ సూపర్బ్‌గా ఉంటే బ్యాంకులు క్షణాల్లో లోన్ అప్రూవ్ చేస్తాయి. తక్కువ వడ్డీకే డబ్బులు దొరుకుతాయి.
స్కోర్ పెంచుకోవడం ఎలా?
భవిష్యత్తులో విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉంటే, ఇప్పటి నుంచే మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్‌ని సెట్ చేసుకోండి. దీనికోసం పెద్ద కష్టపడక్కర్లేదు, కొంచెం డిసిప్లిన్ ఉంటే చాలు. మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలు (EMIs) ఎప్పుడూ టైమ్‌కి కట్టేయండి. అవసరం లేకపోయినా అనవసరంగా లోన్లు తీసుకోవడం, క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడడం తగ్గించండి. అలాగే, మీ క్రెడిట్ రిపోర్టును తరచూ చెక్ చేసుకుంటూ, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోండి.
చివరగా చెప్పేదేంటంటే, మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని వీసా రిజెక్ట్ చేయరు. కానీ, మంచి స్కోర్ ఉంటే మాత్రం అది మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్‌ని చూపిస్తుంది. లాంగ్ టర్మ్ వీసాల విషయంలో ఇది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది.


Click it and Unblock the Notifications