SBI News: స్టాక్ మార్కెట్లో సీనియర్ ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ మాట్లాడే ఒక విషయం దీర్ఘకాలిక పెట్టుబడి. ఇలా ఎలా పనిచేస్తుందనే దానికి తాజా సంఘటన పెద్ద ఉదాహరణని చెప్పుకోవాలి.
ఒక డాక్టర్ తన తాత చేసిన పనికి ఆశ్చర్యపోయాడు. అవును 1994లో కేవలం రూ.500 వెచ్చించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను కొనుగోలు చేశారు. అయితే వాటికి సంబంధించిన షేర్ సర్టిఫికెట్లు తాజాగా బయటపడటం అవి అమ్మకుండా అలాగే ఉండటం గమనించి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఊహించని రీతితో తన తాత పెట్టుబడి బయటకు వచ్చిన విషయాన్ని తన్మయ్ మోతీవాలా అనే పిడియాట్రిక్ సర్జన్ సోషల్ మీడియా వేధికలో పంచుకోవటంతో వైరల్ అయ్యింది.

అయితే ఈ షేర్లను డీమ్యాట్ ఖాతాలోకి ఎలక్ట్రానిక్ రూపంలో బదిలీకి ఇప్పటికే పంపినట్లు యువ డాక్టర్ తెలిపాడు. అప్పట్లో కేవలం రూ.500 పెట్టుబడి విలువ ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు రూ.376 లక్షలకు చేరుకుంది. దీనివల్ల తాను దీర్ఘకాలిక పెట్టుబడులకు ఉన్న నిజమైన శక్తిని గ్రహించానని తన్మయ్ తెలిపారు. అయితే ప్రస్తుతం తాను ఈ షేర్లను అమ్మే ఉద్ధేశంలో లేనని, తనకు ప్రస్తుతం డబ్బుతో అవసరం కూడా లేదని చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి రూ.3.76 లక్షలు చిన్నమెుత్తమే అయినప్పటికీ 1994 కాలంలో రూ.500 అనేది ఒక ప్రభుత్వ టీచరుకు నెల జీతంతో సమానమైనదిగా తన్మయ్ తెలిపారు. ఇదే క్రమంలో మెుదటగా తాను పోస్ట్ చేసిన దానిలో ప్రస్తుత విలువను తప్పుగా లెక్కించానని అతడు పేర్కొన్నాడు. అందువల్ల పాత పోస్టును తాను డిలీట్ చేసినట్లు వెల్లడించాడు. వాస్తవానికి సెబీ రూల్స్ ప్రకారం ఎవరైనా పెట్టుబడిదారుడు తన వద్ద ఫిజికల్ షేర్లను కలిగి ఉన్నట్లయితే ముందుగా వాటిని దరఖాస్తు ద్వారా ఎలక్ట్రానిక్ షేర్లుగా డీమ్యాట్ ఖాతాలోకి జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాటిని విక్రయించేందుకు లేదా ట్రాన్ఫర్ చేసేందుకు వీలు కల్పించబడుతుంది.
ఈ వార్త సోషల్ మీడియాతో పాటు దేశంలోని మీడియా సంస్థల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ విలువ నేడు 10.14 గంటల సమయంలో స్వల్పంగా తగ్గి రూ.764.35 వద్ద మార్కెట్లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications