Mutual Funds: స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో సిప్ ఆపి.. లార్జ్ క్యాప్ ఫండ్లలో స్టార్ట్ చేయాలా..!
గత సంవత్సర కాలంలో స్మాల్-క్యాప్ సూచీలు లార్జ్-క్యాప్ సూచీల కంటే గణనీయంగా మెరుగైన పనితీరును కనబరిచాయి. దీంతో పెట్టుబడిదారులు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను (SIPలు) కొనసాగించాలా లేక కొత్త పెట్టుబడులను లార్జ్-క్యాప్ ఫండ్ల వైపు మళ్లించాలా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మాల్-క్యాప్ సూచీలు అద్భుతమైన పనితీరును కనబరిచిన తర్వాత, వాటి సగటు విలువ తిరిగి పెరగవచ్చని చారిత్రక డేటా పేర్కొంటుంది. కేవలం ఇటీవలి మార్కెట్ కదలికల కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడి వ్యూహాన్ని మార్చుకోకూడదని నిపుణులు అంటున్నారు.
బలమైన రాబడులు ఒక పోర్ట్‌ఫోలియోలో స్మాల్, మిడ్-క్యాప్ ఫండ్ల వాటాను పెంచగలవని చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడిదారులు తమ నెలవారీ పెట్టుబడులను మార్చకపోయినా రీబ్యాలెన్సింగ్ అవసరం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. లార్జ్, మిడ్, స్మాల్-క్యాప్ ఫండ్లు, బంగారం, డెట్, గ్లోబల్ ఈక్విటీలలో పెట్టుబడలు పెట్టాలని సూచిస్తున్నారు. స్మాల్ క్యాప్, మిడ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో సిప్ వేసే వారు కొనసాగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కేవలం మార్కెట్ కదలికలు లేదా వాల్యుయేషన్ గణాంకాల ఆధారంగా పెట్టుబడిదారులు తమ కేటాయింపులలో మార్పులు చేయకూడదని సూచిస్తున్నారు.

మిడ్‌క్యాప్‌లు అంచనా వేసిన దాని కంటే దాదాపు 20 శాతం తక్కువగా ట్రేడ్ అవుతుండగా, స్మాల్ క్యాప్‌లు దాదాపు 18% తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 50 తన అంచనా వేసిన సరసమైన విలువ కంటే 16% తక్కువగా ట్రేడ్ అవుతోందని వివరిస్తున్నారు. ఒకవేళ మిడ్, స్మాల్-క్యాప్ కేటాయింపు మొత్తం పోర్ట్‌ఫోలియోలో దాదాపు 25 శాతం ఉంటే కేవలం ఇటీవలి మార్కెట్ పనితీరు కారణంగా మార్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు ఒక నిర్దిష్ట సూచీ పనితీరును కాకుండా ముందుగా తమ మొత్తం ఆస్తుల కేటాయింపును చూడాలన్నారు. ఉదాహరణకు మీరు రూ.10000 మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు అనుకుంటే.
అందులో 25 శాతం స్మాల్ క్యాప్, 10 శాతం మిడ్ క్యాప్, 15 శాతం డెట్ ఫండ్స్, 10 శాతం బంగారంపై, లార్జ్ క్యాప్ లో 25 శాతం పెట్టుబడి పెట్టాలి. 15 శాతం పెట్టుబడిని ప్లెక్సీ క్యాప్ లేదా మల్టీక్యాప్ లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. స్మాల్ క్యాప్ ఎంత వేగంగా రాబడి ఇస్తుందో అంతే వేగంగా పడిపోతుందని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పెట్టుబడిలో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. స్మాల్ క్యాప్ ఫండ్లలో దీర్ఘకాలం పెట్టుబడి పెడితేనే మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications