పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వివిధ రకాల పెట్టుబడి స్కింలలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సేఫ్ అప్షన్స్ ఉన్నప్పటికీ వీటి రాబడి చాలా తక్కువగా ఉంటుంది. మీరు కొంచెం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే స్టాక్ మార్కెట్ ఒక మంచి అప్షన్. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, మీరు మీ పిల్లల పేరుతో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, దీనిని మైనర్ డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఈ అకౌంట్ ద్వారా మీ పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయవచ్చు.

డీమ్యాట్ అకౌంట్ తెరవడం సులభమేనా: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. జెరోధా (Zerodha) వంటి కొన్ని ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో డీమ్యాట్ అకౌంట్ ఈజీగా తెరవవచ్చు. దీని కోసం కొన్ని అవసరమైన డాకుమెంట్స్, మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీరు ఇంట్లో నుంచే మీ పిల్లల కోసం డీమ్యాట్ అకౌంట్ తెరవగలరు.
నిబంధనలు ఏమిటి: డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి వయస్సు పరిమితి లేదు. అంటే, మీరు మీ మైనర్ పిల్లల పేరుతో అకౌంట్ తెరిచి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయవచ్చు. అయితే, మైనర్ డీమ్యాట్ అకౌంట్లకు కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. ఈ అకౌంట్ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మాత్రమే నిర్వహించగలరు. కానీ మైనర్లు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే స్వతంత్రంగా ట్రేడింగ్ చేసే హక్కు ఉంటుంది.
ఏ డాకుమెంట్స్ అవసరం: మైనర్ డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి మీకు ఈ క్రింది డాకుమెంట్స్ అవసరం:
తల్లిదండ్రులు లేదా సంరక్షకుల: పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ (ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడి మొదలైనవి). అలాగే పిల్లల బర్త్ సర్టిఫికెట్ (దీనిపై తల్లిదండ్రుల పేరు ఎంటర్ చేయాలి). తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సెబీ KYC ప్రక్రియ పూర్తి చేసి, సంబంధిత బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించాలి. అకౌంట్ తెరిచేటప్పుడు మైనర్ ఫోటోతో పాటు తల్లిదండ్రుల ఫోటోలు కూడా అవసరం. ఇంకా డీమ్యాట్ అకౌంట్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తెరవవచ్చు.
ట్రేడింగ్ ఎలా జరుగుతుంది: ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే మైనర్ డీమ్యాట్ అకౌంట్ నుండి నేరుగా స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టలేరు. కుటుంబ సభ్యుల నుండి గిఫ్ట్లుగా లేదా విరాళంగా అందుకున్న షేర్లను మాత్రమే ఈ అకౌంట్లో ఉంచవచ్చు.
దీని అర్థం ఏమిటంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు స్వంత డీమ్యాట్ అకౌంట్ నుండి షేర్లను కొనుగోలు చేసి ఆపై వాటిని పిల్లలకు గిఫ్టుగా పంపాలి. డీమ్యాట్ అకౌంట్లో 'గిఫ్ట్ ట్రాన్స్ఫర్' (Gift and Transfer) అనే అప్షన్ ఉంటుంది. గిఫ్టుగా లేదా డొనేషన్ అందుకున్న ఈ షేర్లను తరువాత అవసరాన్ని బట్టి అమ్ముకోవచ్చు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?



Click it and Unblock the Notifications