Gold: తొందరపడి బంగారం కొనుగోలు చేస్తున్నారా.. అయితే గత 20 ఏళ్లలో బంగారం ఎంత రాబడి ఇచ్చిందో తెలుసుకోండి..!
బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా బంగారం ధర పెరిగింది. 4 క్యారెట్ల తులం బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63970 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.800 పెరిగి రూ. 1,50, 300కు చేరింది. ఇక 18 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.610 పెరిగి 1,22,930 వద్ద కొనసాగుతోంది. పసిడి ధరలు ఇంకా పెరుగుతాయా లేక ఇదే స్థాయిలో ఉంటాయా అనే దానిపై క్లారిటీ కనిపించండం లేదు. అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్ పరిణామాలు, రికార్డు స్థాయికి చేరిన యూఎస్ ప్రభుత్వ రుణాలు, బలహీనపడుతున్న డాలర్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వాషింగ్టన్ జాతీయ రుణం భారీ స్థాయికి చేరిన వేళ.. దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడానికి అమెరికా ట్రెజరీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బాండ్ ఈల్డ్స్‌ను, డాలర్ విలువను పడగొట్టడంతో బంగారం ధర పెరిగినట్లు విశ్లేషిస్తున్నారు. అమెరికా డాలర్ కరెన్సీ బలహీనపడటంతో ద్రవ్య లోటు భయాల నుంచి గట్టెక్కడానికి చేసే ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులకు డాలర్ పై నమ్మం తగ్గి సురక్షితమైన పెట్టుబడులు వైపు మళ్లుతున్నారు. అందుకే బంగారం పెట్టుబడికి మొగ్గు చూపుతున్నట్లు వివరిస్తున్నారు. ఇందుకే పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయని పేర్కొంటున్నారు.

బంగారం స్వల్పకాలంలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మాత్రం ద్రవ్యోల్బణాన్ని నిలకడగా అధిగమిస్తున్నట్లు స్పష్టమవుతోందని ఫండ్స్ ఇండియా ఆగస్టు 2026 రిపోర్ట్ లో పేర్కొంది. 1995 నుంచి 2025 మధ్య డేటాను పరిశీలిస్తే.. కేవలం ఒక ఏడాది కాలపరిమితిలో బంగారం రాబడులు అత్యంత అస్థిరంగా ఉన్నాయని వివరించింది. కొన్ని సమయాల్లో ద్రవ్యోల్బణం కంటే 24 శాతం అధిక లాభాలను ఇస్తే.. మరికొన్ని సందర్భాల్లో 28 శాతం తక్కువ లాభాలను ఇచ్చాయని విశ్లేషించింది. స్వల్పకాలిక వ్యత్యాసాల కారణంగా బంగారం ధరలు ప్రతిసారీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతూపోతాయని కచ్చితంగా చెప్పలేమని స్పష్టం చేసింది.
అయితే పెట్టుబడి కాలాన్ని పెంచుకుంటూ పోతే 5, 10, 15, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితిని పరిశీలిస్తే.. బంగారం సగటున ద్రవ్యోల్బణం కంటే దాదాపు 5 శాతం అదనపు వార్షిక రాబడిని అందించినట్లు నివేదిక పేర్కొంది. అంటే షార్ట్ టర్మ్‌లో బంగారం ధరలు ప్రతిరోజూ పెరగకపోయినా, లాంగ్ టర్మ్‌లో మాత్రం ద్రవ్యోల్బణ దెబ్బ నుంచి మన కొనుగోలు శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. చరిత్ర ప్రకారం బంగారం ఎప్పుడూ ఒకే రేఖలో స్థిరమైన లాభాలను ఇవ్వలేదు. వివిధ కాలాల్లో దీని సగటు వార్షిక రాబడి దాదాపు 10 శాతంగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications