సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఈ సమయంలో పిల్లలతో, ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్'తో కలిసి ఎక్కడికైనా జాలి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... ఈ రోజుల్లో ఫ్లయిట్లో జర్నీ చేయాలనీ చాల మందికి కోరిక ఉంటుంది. అయితే ఫ్లయిట్ టిక్కెట్లు కాస్త కాస్ట్ ఎక్కువే. దింతో ఎంత కోరిక ఉన్నా విమానంలో ప్రయాణించలేకపోతుంటారు. కానీ మీరు కొన్ని ఈ టిప్స్ పాటిస్తే ఇండియాలో లేదా ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టిక్కెట్లను చాలా తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు. అవును నిజంగానే.. ఇలా చేయడం ద్వారా మీ డబ్బు ఆదా చేయడమే కాకుండా మీ కలల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో నెరవేర్చుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్లో గోవా ఇంకా హానీ మూన్ ప్లాన్ చేసుకునే వారికీ కూడా చాల ఉపయోగపడుతుంది.

విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఈ టిప్స్ పాటించండి :-
1. వీలైనంత ముందుగా టికెట్స్ బుక్ చేసుకోండి: మీరు మీ టూర్ ప్లాన్ చేసిన తేదీకి 2-3 నెలల ముందుగానే టిక్కెట్ల కోసం వెతకడం ప్రారంభించాలి. మీకు తక్కువ ధరకు ఫ్లయిట్ టికెట్ కనిపించిన వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే అంతగా రేట్స్ పెరగవచ్చు.
2. వీక్ డేస్'లో టిక్కెట్లు బుక్ చేసుకోండి: సాధారణంగా వీకెండ్ డేస్'లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ఫ్లయిట్ టిక్కెట్లను వీక్ డేస్'లో బుక్ చేసుకోండి. అంటే మంగళవారం లేదా బుధవారం ఇలాంటి రోజుల్లో విమాన టికెట్ బుక్ చేసువాలి. ఈ రెండు రోజుల్లో విమానయాన సంస్థలు రేట్లను మారుస్తుంటాయి.
3. రాత్రి సమయాల్లో: రాత్రి సమయాల్లో ప్రయాణీకులు కాస్త తక్కువగా ఉంటారు. అందువల్ల ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇంకా రాత్రిపూట విమానాలు ఆలస్యం ఉండవు. రాత్రి సమయం కాబట్టి స్వచ్ఛమైన గాలి వీస్తుంది. నైట్ టైంలో ప్రయాణించడం వొద్దు అనుకుంటే మీరు ఉదయం అంటే తెల్లవారుజామున కూడా ప్రయాణించవచ్చు.
4. కనెక్టింగ్ ఫ్లైట్ బెస్ట్ అప్షన్ : మీరు డైరెక్ట్ ఫ్లైట్ కంటే కనెక్టింగ్ ఫ్లైట్ అప్షన్ కోసం వెతకాలి. ఇవి తక్కువ ధరకు ఉంటాయి. కానీ ఇలాంటి విమానాలు జర్నీకి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు ఎక్కువ సమయం ఉంటే ఈ అప్షన్ ఉపయోగకరంగా ఉంటుంది.
5. బ్రౌజర్‌లో ప్రైవేట్ మోడ్‌ను ఉపయోగించండి: విమాన టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రైవేట్ మోడ్‌ను ఉపయోగించండి. మీరు Google Chromeలో incognite మోడ్‌ను ఉపయోగించవచ్చు. విమాన బుకింగ్ వెబ్‌సైట్‌లు కుక్కీలను ఉపయోగిస్తాయి. కాబట్టి బ్రౌజర్‌లో చేసిన సెర్చ్ ప్రకారం ఎక్కువ ఛార్జీలని చూపిస్తాయి.
6. క్రెడిట్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించుకోండి: చాల వరకు ట్రావెల్ కంపెనీలు ICICI, Axis, HDFC మొదలైన బ్యాంకులతో డీల్స్ కుదుర్చుకుంటాయి. కాబట్టి మీరు ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై డిస్కౌంట్ పొందవచ్చు.
7. నాన్ రిఫండబుల్ టికెట్ బుక్ చేసుకోవడం కూడా బెస్ట్ : మీ జర్నీ తేదీ, రిటర్న్ వచ్చే తేదీ ఫిక్స్ అయితే మీరు నాన్ రిఫండబుల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రిఫండబుల్ టిక్కెట్ల ఎక్కువ కాస్ట్ ఉంటాయి. టికెట్ బుక్ చేసుకునే ముందు ఎయిర్ లైన్స్ వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications