రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ పోయిందని కంగారు పడుతున్నారా..? అయితే ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మీ ఫోన్‌ను వెంటనే కనిపెడుతుంది. దీని కోసం ఇండియన్ రైల్వే, టెలికమ్యూనికేషన్స్ శాఖలు కలిసి పని చేస్తున్నాయి.

పైలట్ ప్రాజెక్ట్ సూపర్ హిట్: నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR)లో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. టెలికమ్యూనికేషన్స్ శాఖకు చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌తో RPF విజయవంతంగా అనుసంధానమైంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే అద్భుతమైన ఫలితాలు చూపిందని రైల్వే ప్రకటించింది. కేవలం NFRలోనే 1.15 లక్షలకు పైగా ప్రయాణికుల ఫోన్‌లను తిరిగి ఇచ్చారట. ఈ ఘనత తర్వాత ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలలో అమలు చేయనున్నారు.
పని చేస్తుందంటే : CEIR పోర్టల్ అనేది పోగొట్టుకున్న లేదా దొంగిలించిన మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం, వాటిని తిరిగి పొందడం కోసం రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్. RPF ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని పోగొట్టుకున్న ఫోన్‌ల IMEI నంబర్‌లను బ్లాక్ చేస్తుంది. దీనివల్ల ఆ ఫోన్‌లు నిరుపయోగంగా మారతాయి. వాటిని వేరే వాళ్ళకి అమ్మడానికి కూడా ఉండదు. అధునాతన పర్యవేక్షణ ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌లను వేగంగా గుర్తించి తిరిగి ఇవ్వడంలో CEIR సాయపడుతుంది.
కంప్లెయింట్ చేయడం ఎలా: మీ మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించిన 'రైల్ మదద్' ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా 139కి కాల్ చేయడం ద్వారా కంప్లెయింట్ చేయవచ్చు. మీరు ఎఫ్ఐఆర్ (FIR) రిజిస్టర్ చేయకూడదనుకుంటే నేరుగా CEIR పోర్టల్‌లో కంప్లెయింట్ చేయమని కూడా సూచిస్తారు. RPF డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ CEIR పోర్టల్‌తో RPF సహకారం రైల్వే భద్రతలో ఒక గొప్ప విజయం అని అన్నారు.
ఆపరేషన్ అమానత్ కూడా సక్సెస్: రైళ్లు, రైల్వే స్టేషన్లలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందేందుకు RPF చేపట్టిన 'ఆపరేషన్ అమానత్' కూడా చాలా విజయవంతమైంది. జనవరి 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య RPF ఏకంగా రూ.84.03 కోట్ల విలువైన పోయిన వస్తువులను వాటి యజమానులకు తిరిగి అప్పగించింది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రయాణికులకు పారదర్శకమైన, ప్రభావవంతమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని RPF చెబుతోంది. ఈ ప్రయత్నాలు చట్టాన్ని అమలు చేసే సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు రైలు ప్రయాణికులలో నమ్మకాన్ని కూడా పెంచుతాయి.


Click it and Unblock the Notifications