కేంద్ర బడ్జెట్ డేట్ ఫిబ్రవరి 1కి ఎందుకు మార్చారో తెలుసా..? బ్రిటీష్ ఆనవాయితీతో లింక్..
ఇండియాలో ఫిబ్రవరి 1న బడ్జెట్ డే. ఈ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే కొన్నేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి చివరి రోజున మాత్రమే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. అయితే ఈ తేదీని ఫిబ్రవరి 1కి ఎందుకు మార్చారో తెలుసా...
బ్రిటీష్ పాలన కాలం నుండి భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా దేశ ఆర్థిక నివేదికలను ఫిబ్రవరి చివరి వారంలో సమర్పిస్తుంటారు. అయితే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ.. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున కాకుండా ఫిబ్రవరి మొదటి రోజున ప్రవేశపెడతామని ప్రకటించారు.

భారత్ వలస పాలన నుంచి బయటపడి ఇప్పుడు స్వావలంబన కలిగిన దేశంగా మారిందని, బ్రిటీష్ కాలం నాటి ఆచారాన్ని మనం ఎందుకు పాటించాలని అలాగే ఫిబ్రవరి 1న భారత ఆర్థిక నివేదికను అందజేస్తామని అరుణ్ జైట్లీ అన్నారు.
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమై ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్‌ను సమర్పిస్తారని కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మధ్య కేవలం నెల రోజులు మాత్రమే ఉండటంతో ఆర్థిక మార్పులు తీసుకురావడానికి సమయం ఉండటం లేదన్నారు. అందువల్ల ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ప్రభుత్వం కొన్ని ఆర్థికపరమైన మార్పులు తీసుకురావడం ఈజీ అవుతుందన్నారు.
అలాగే, 2017 వరకు భారతదేశంలో కేంద్ర బడ్జెట్ అలాగే రైల్వే బడ్జెట్ విడివిడిగా సమర్పించేవారు. 2017లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశారు. అప్పటి నుంచి పార్లమెంట్‌లో మిడ్ టర్మ్ బడ్జెట్‌తో పాటు కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు.
అదేవిధంగా, 1999 వరకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే సమయం సాయంత్రం 5 గంటలు. అయితే 1999లో మాత్రమే ఈ విధానాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. బ్రిటీష్ హయాంలో భారతదేశంలో పగటిపూట మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆచారం ఉండేది, కాబట్టి వారు భారతదేశంలో మధ్యాహ్నం 12:30 గంటలకు బడ్జెట్‌ను సమర్పించారు.
అయితే బడ్జెట్ ప్రవేశపెట్టె తేదీ మార్పుపై వివాదం కూడా నెలకొంది. ఈ చర్యను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. బడ్జెట్‌ను ముందు తేదీకి మార్చడం వల్ల రాష్ట్ర ఎన్నికలకు ముందు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం వాగ్దానాలు చేయవచ్చని పిటిషన్ వాదించింది. కేంద్ర బడ్జెట్‌కు రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్రాల ఎన్నికలు కేంద్రం పనితీరుకు ఆటంకం కలగదని పేర్కొంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


Click it and Unblock the Notifications