Large Cap Mutual Funds: పదేళ్లలో అత్యధిక రాబడి ఇచ్చిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
గత సంవత్సం కాలంగా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల రాబడులు తగ్గిపోయాయి. దానికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లు పడిపోవడం. పెద్ద కంపెనీల స్టాక్స్ కూడా పడిపోవడంతో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో రాబడి తగ్గిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా అధిక రాబడులు ఇచ్చిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఏవో ఒకసారి పరిశీలిద్దాం. వాల్యూ రీసెర్చ్ ప్రకారం నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పదేళ్లలో 13.7 శాతం రాబడి ఇచ్చింది. ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇదే కాలంలో 13.40 శాతం రాబడి ఇచ్చింది.
కెనరా రోబకో లార్జ్ క్యాప్ ఫండ్ పదేళ్లలో 13.40 శాతం రాబడి ఇవ్వగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ 13 శాతం, బరోడా బీఎన్పీ పరిబాస్ లార్జ్ క్యాప్ 12.90 శాతం, ఎడి్ల్వైస్ లార్జ్ క్యాప్ ఫండ్ 12.90 శాతం రాబడి ఇచ్చాయి. బంధన్ లార్జ్ క్యాప్ పదేళ్లలో 12.7 శాతం, కోటక్ లార్జ్ క్యాప్ 12.4 శాతం, సుందరం లార్జ్ క్యాప్ 122.30 శాతం, యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ 12.30 శాతం, మిరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 12.10 శాతం, హెడి ఎఫ్ సీ లార్జ్ క్యాప్ ఫండ్ 11.8 శాతం, టాటా లార్జ్ క్యాప్ 11.8 శాతం రాబడులు ఇచ్చాయి. ఇవి గత పదేళ్లలో వచ్చిన రాబడి మాత్రమే.. వచ్చే దశాబ్దంలో ఏ ఫండ్ అగ్రస్థానంలో ఉంటుందో మీకు చెప్పలేము. లార్జ్-క్యాప్ ఫండ్ అనేది ఒక ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం.

సెబీ నిబంధనల ప్రకారం ఇది తన మొత్తం ఆస్తులలో కనీసం 80 శాతాన్ని (బ్లాగ్) లార్జ్-క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలి. పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా లార్జ్-క్యాప్ కంపెనీలను 100 అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలుగా నిర్వచించారు. లార్జ్-క్యాప్‌లుగా అర్హత పొందే కంపెనీల జాబితాను కాలానుగుణంగా సవరిస్తారు, కాబట్టి పెట్టుబడి పెట్టగల కంపెనీల ప్రపంచం ఒక దశాబ్ద కాలంలో మారుతూ ఉంటుందని గుర్తుంచుకోవాలి.పోర్ట్‌ఫోలియోలోని మిగిలిన 20 శాతాన్ని కొన్ని ఫండ్లు మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. కొన్ని మాత్రం టాప్ 100 కంపెనీలకే పరిమితమవుతాయి. చారిత్రాత్మకంగా చూస్తే లార్జ్ క్యాప్ కంపెనీలతో పాటు మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఫండ్లు అధిక రాబడులు ఇచ్చాయి. అవి తీవ్రంగా పడిపోయినప్పుడు నష్టాలను కూడా తెచ్చిపెట్టాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications