మన దేశంలో బంగారంకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇతర లోహాలకన్న బంగారం కొనేందుకే ఎక్కువ ఇష్టపడతారు. అంతేకాదు మన దేశంలో ఎలాంటి శుభకార్యాలకైనా, పండగలకైనా ముందుగా మహిళలు కోరుకునేది బంగారు ఆభరణాలే. భారతదేశంలో బంగారు ఆభరణాలు ధరించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. అయితే మార్కెట్లో మనకు దొరికే బంగారం వివిధ గ్రాముల రూపంలో లభిస్తుంది. అయితే సాధారణంగా బంగారాన్ని క్యారెట్ల రూపంలో స్వచ్ఛతను చూస్తారు ఇంకా గ్రాముల రూపంలో లభిస్తుంది.
జ్యువెలరీ షాపుల్లో 24క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లలో పసిడి ఆభరణాలు లభిస్తుండగా, కొన్ని చోట్ల 1 గ్రామ్ గోల్డ్ కూడా లభిస్తుంటుంది. ఇక బంగారం ధర విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో పసిడి ధర సామాన్యులకి చుక్కలు చూపిస్తుంది. ఇండియాలోని ప్రముఖ నగరాల్లో 24క్యారెట్ల 10 గ్రాముల ధర 80 వేల చేరువలో ఉండగా, 22క్యారెట్ల ధర 75వేల చేరువలో ఉంది. అయితే పసిడి ధరలు రోజురోజుకి మారుతూ ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యల సీజన్ నడుస్తుంది కాబట్టి బంగారానికి కాస్త డిమాండ్ పెరిగింది. దీనికితోడు gst, ఇతర మేకింగ్ చార్జీలు అదనంగా ఉంటాయి. అయితే బంగారం తక్కువ ధరకే లభిస్తుందంటే ఎవరు కాదంటారు చెప్పండి. నేటి ధరలను చూస్తే చెన్నైలో 24క్యారెట్ల 10గ్రాముల ధర రూ.74710, ముంబైలో 10గ్రాముల ధర రూ.74710, ఢీల్లీలో 10గ్రాముల ధర రూ.78,073, కలకత్తాలో 10గ్రాముల ధర రూ.77,655, హైదరాబాద్లో 10గ్రాముల ధర రూ.77,618
ఇతర దేశాలలో బంగారం ధర ఎంతంటే
ఇండోనేషియాలో ప్రపంచంలోనే చౌకైన బంగారం ధర లభిస్తుంది. ఇండోనేషియాలో 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,330,266 IDR అంటే సుమారు రూ. 71,880. మలావి తూర్పు ఆఫ్రికా దేశం. ఈ దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,482,660.70 MWK అంటే 10 గ్రాములకు రూ.72,030.
హాంకాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతం. ఈ దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు HKD 665 అంటే 10 గ్రాములకు రూ.72,050. కంబోడియా దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర భారతదేశంలో కంటే చాలా తక్కువ. కంబోడియాలో బంగారం ధర 347,378.43 KHR అంటే 10 గ్రాములకు రూ. 72,060గా ఉంది. దుబాయ్‌లో 24-క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు AED 3180.25 అంటే సుమారు రూ. 72,840. అయితే భారతదేశం కంటే బంగారం ధరలు తక్కువగా ఉన్న అనేక ఇతర దేశాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications