అత్యధిక యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లతో భారతీయ సంగీత, సినీ నిర్మాణ సంస్థ T-Series YouTube ఛానెల్ అగ్రస్థానంలో ఉందని జర్మనీకి చెందిన వినియోగదారు డేటా, మార్కెట్ సంస్థ తెలిపింది. ఈ టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్ తర్వాత PewDiePie, Mr బీస్ట్ యూట్యూబ్ ఛానెళ్ల కంటే ముందుంది.స్టాటిస్టా జనవరి 25 వరకు ఉన్న ప్రతి ఖాతాలను అనుసరించే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంది.

కోకోమెలన్
మొదటి ఎనిమిది స్థానాల్లో యూట్యూబ్ ఛానెళ్లను ప్రకటించింది. T-సిరీస్‌కు 234 మిలియన్ల (23,40,00,000) మంది సబ్‌స్క్రైబర్‌లతో మొదటి స్థానంలో ఉంది. శనివారం మధ్యాహ్నం వరకు సబ్‌స్క్రైబర్లు 23 కోట్ల 60 లక్షలకు చేరుకున్నారు. 152 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లతో, నర్సరీ రైమ్‌ల యానిమేటెడ్ వీడియోలను అప్‌లోడ్ చేసే అమెరికన్ యూట్యూబ్ ఛానెల్ కోకోమెలన్ రెండో స్థానంలో ఉంది.

సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్
SET (సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్) ఇండియా జనవరి 25 వరకు 150 మిలియన్ల మంది సభ్యులతో మూడో స్థానంలో ఉంది.
అమెరికన్ యూట్యూబర్ Mr బీస్ట్, అతని విపరీతమైన విన్యాసాలు, పెద్ద బహుమతుల కారణంగా ప్రజాదరణ పొందారు.అతను 129 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

PewDiePie
స్వీడన్‌కు చెందిన PewDiePie 111 మిలియన్ల చందాదారులతో ఐదవ స్థానంలో ఉంది. అతను ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ యూట్యూబర్‌లలో ఒకడు. అయితే అతని అభ్యంతరకరమైన మాటలతో పలు మార్లు చిక్కుల్లో పడ్డాడు. 2016లో తాను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరానని సరదాగా వ్యాఖ్యానించినందుకు ట్విట్టర్ నుంచి అతను సస్పెండ్ అయ్యాడు. ఉక్రెయిన్ కిడ్స్ డయానా షో (107 మిలియన్లు) ఆరో స్థానంలో, రష్యన్ చైల్డ్ ఆర్టిస్ట్ లైక్ నాస్త్య (104 మిలియన్లు) ఏడో స్థానంలో, WWE YouTube ఖాతా (93 మిలియన్లు)8వ స్థానంలో ఉంది.
షార్ట్ బ్రేక్
షార్ట్ వీడియోల్లో గత సంవత్సరం YouTube టాప్ 20 క్రియేటర్‌లలో దాదాపు సగం మంది భారతీయులే ఉన్నారు. మొదటి మూడు స్థానాల్లో షార్ట్ బ్రేక్ (15 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు), గుల్షన్ కల్రా (17.9 మిలియన్ సబ్‌స్క్రైబర్లు), అక్షయ్ నగవాడియా (14.7 మిలియన్ సబ్‌స్క్రైబర్లు) ఉన్నారు.


Click it and Unblock the Notifications