మనం సాఫ్ట్ డ్రింక్స్ గురించి మాట్లాడితే టక్కున వచ్చే మొదటి పేరు పెప్సి లేదా కోకా-కోలా. అయితే వీటిలో పెప్సికో గురించి చెప్పాలంటే ఈ అమెరికన్ బ్రాండ్ నేడు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయ్యింది. ఇంకా కంపెనీ 200 కంటే పైగా దేశాలలో వ్యాపారం కోనసాగిస్తుంది. కానీ పెప్సి బ్రాండ్ ఎలా మొదలైందో తెలుసా ? అసలు ఈ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ మార్కెట్లో ఎలా టాప్ బ్రాండ్ అయ్యిందంటే..
1893లో ప్రారంభం: పెప్సి ప్రారంభం గురించి చెప్పాలంటే 1893లో నార్త్ కరోలినాలోని న్యూ బెర్న్‌లో జరిగింది. దీనిని మొదట మందులు(medicine)లాగ ఉపయోగించేందుకు తయారు చేశారు. దీనిని ప్రారంభించిన వ్యక్తి పేరు కాలేబ్ బ్రాధమ్, అతను వృత్తిరీత్యా ఫార్మసిస్ట్. నీటిలో చక్కెర, పాకం, జాజికాయ, నిమ్మకాయ ఇంకా కోలా గింజలు కలిపి ఒక పానీయం తయారు చేసి దానిని 'బ్రాడ్స్ డ్రింక్' పేరుతో తన షాపులో అమ్మడం ప్రారంభించాడు. మనిషి జీర్ణక్రియను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ పానీయాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టాడు కానీ తరువాత దాని అమ్మకాలు పెరగడంతో ఈ పానీయం పేరును మార్చాలనే ఆలోచన వచ్చింది.

పెప్సి పేరుతో మార్కెట్లోకి : కాలేబ్ బ్రాడ్‌హామ్ 1898లో పెప్సిన్ ఎంజైమ్ పేరు తర్వాత ఈ పానీయం పేరును పెప్సిగా మార్చి ఆరోగ్యకరమైన కోలాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. ఈ పానీయం మొదట్లో energizing and aids in digestion అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించారు, తరువాత అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో లోగోలో కూడా అనేక మార్పులు చేసింది, దీని ప్రభావం అమ్మకాలపై కూడా కనిపించింది.
కాలంతో పాటు మారుతూ వచ్చిన లోగో: 1940లో పెప్సి కోలా లోగోను ఒక వింత ఫాంట్‌తో రూపొందించారు, కానీ తర్వాత ఫాంట్ మారుతూ వచ్చింది. మొదట్లో లోగో కోకా కోలా లాగానే ఎరుపు రంగులో ఉండేది. తరువాత వెరైటీ ఆలోచనతో కంపెనీ 1950లో మొదటిసారిగా ఈ పానీయం బాటిల్ మూతపై లోగోకు నీలం ఇంకా తెలుపు రంగును తీసుకొచ్చింది. తరువాత మెల్లిమెల్లిగా లోగో అండ్ ట్యాగ్‌లైన్ మరింత ఆకర్షణీయంగా మారాయి, ఇలా వ్యాపారం కూడా పెరుగుతూ వచ్చింది.
కోట్ల ఆదాయం: పెప్సికోకు నేడు కార్బోనేటేడ్ అండ్ నాన్-కార్బోనేటేడ్ పానీయాల మార్కెట్లో పేరు చెప్పనవసరం లేదు. కంపెనీ వ్యాపారం ప్రపంచంలోని 200 కంటే ఎక్కువ దేశాలలో విస్తరించి ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తులు లాటిన్ అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, ఆఫ్రికా, భారతదేశం, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా ఇతర దేశాలలో ఉన్నాయి. దీనితో పాటు, పెప్సి మాతృ సంస్థ ఔషధంగా ప్రారంభమై గొప్ప ఎత్తులకు చేరుకుంది, పెప్సి ఇన్కార్పొరేటెడ్ ఫార్చ్యూన్-500 లిస్టులో చేరిన ఒక అమెరికన్ మల్టీనేషనల్ సంస్థ. దీని హెడ్ ఆఫీస్ న్యూయార్క్‌లో ఉంది. ఇప్పుడు కంపెనీకి మిరిండా, ఓషన్ స్ప్రే, మౌంటైన్ డ్యూ, అక్వాఫినా, లిప్టన్, 7అప్, ట్రోపికానా, AMP ఎనర్జీ వంటి ఇతర బ్రాండ్లు ఉన్నాయి, అయితే స్నాక్ బ్రాండ్లు రఫిల్స్, ఫ్రిటోస్, చీటోస్, క్రాకర్ జాక్, సన్ చిప్స్, టోస్టిటోస్, లేస్ కూడా ఈ కంపెనీ ఉత్పత్తులే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications