Gold: బంగారు ఆభరణాల్లో గోల్డ్‎తో పాటు ఏ లోహాలు ఉంటాయో తెలుసా..!

భారతీయులు ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పసిడి అంటే మహిళలు పడి చంచిపోతుంటారు. కనీసం ఒక్క గ్రామైన కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే ఇది బంగారం కొనుగోలు చేయడం చాలా మంచి నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పసిడి ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. అయితే బంగారం కొనుగోలు చేసిన చాలా మంది.. ఆ పసిడితో ఆభరణాలు చేయించుకుంటారు. 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేసి స్వర్ణకారుడి వద్దకు వెల్లి నగలు చేయమంటారు. అయితే స్వచ్ఛమైన బంగారం ఆభరణాలు తయారు చేయడానికి పనికి రాదు. 24 క్యారెట్ల పసిడి మొత్తగా ఉంటుంది.

నగ చేయడానికి పనికి రాదు. అందుకే ఈ బంగారంలో ఇతర లోహాలు కలిపి ఆభరణాలు చేస్తారు. బంగారంలో పలు రకాల లోహాలను కలిపి అవకాశం ఉంది. పసిడిలో రాగి, వెండి, నికెల్, కాడ్మియం, పల్లాడియం, జింక్ వంటి లోహాలను కలుపుతారు. 24 క్యారెట్ల బంగారం అంటే 99.9 శాతం స్వచ్ఛతగల పసిడి అని అర్థం. అందుకే నగలు చేయడానికి ఈ పుత్తడి పనికి రాదు. స్వచ్ఛమైన బంగారంలో ఇతర లోహాలను కలపడం వల్ల అది 22 క్యారెట్ల బంగారంగా మారిపోతుంది. అంటే స్వచ్ఛత 91.6 శాతానికి పడిపోతుంది. ఇందులో 8.4 శాతం ఇతర లోహాలు ఉంటాయి. ఈ బంగారాన్ని 9916 కేడీఎం అని కూడా అంటారు.

Gold

లోహాలను కలిపే కొద్ది బంగారం క్వాలిటీ తగ్గిపోతుంది. 18 క్యారెట్ల బంగారంలో లోహాలు ఎక్కువ కలుపుతారు. ఇక 14 క్యారెట్ల పసిడిలో ఇంకా ఎక్కువ లోహాలు కలుపుతారు. అయితే రంగును బట్టి బంగారం క్వాలిటీని చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటే 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా, డార్కిష్‌గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 18 క్యారెట్ల బంగారంలో ఆరు భాగాలు ఇతర లోహాలు కలిసి కలుపుతారు. ఇందులో బంగారం స్వచ్ఛత 75 శాతం కాగా, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

24, 22 క్యారెట్ల బంగారం కంటే 18 క్యారెట్ల పపసిడి మరింత దృఢంగా ఉంటుంది. 14 క్యారెట్ల బంగారంలో 58.3 శాతం పుత్తడి, మిగిలిన 41.7 శాతం ఇతర లోహాలు ఉంటాయి. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా అందుబాటులో ఉంది. క్యారెట్లు తగ్గిన కొద్ది ధరలు కూడా తగ్గుతుంటాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+