Success Story: గుర్తింపు పొందిన వ్యాపారవేత్త స్థాయికి వెళ్లాలంటే అంత సులువేమీ కాదు. రుణాలు పొందేందుకు సహాయం చేసిన ఆయన ప్రస్తుతం బిలియనీర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం చెన్నైలో అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నారు.
దక్షిణ భారతదేశంలో జి రాజేంద్రన్ ది అత్యంత స్ఫూర్తిదాయకమైన విజయగాథల్లో ఒకటి. సాధారణ గోల్డ్ అప్రైజర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 80 ఏళ్ల వయస్సులో రూ.15,700 కోట్ల నికర విలువతో దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన బంగారం, ఆభరణాల నుంచి విద్యా సంస్థలు, హోటళ్ల వరకు అనేక వ్యపారాల్లోకి ఆయన విస్తరించారు.

GRT జ్యువెలర్స్ రాజేంద్రన్‌కు భారీ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. చెన్నై సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కోసం బంగారు రుణాల కోసం గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తూ తన వృత్తిని ప్రారంభించారు. నిరాడంబరమైన గోల్డ్ అప్రైజర్‌గా కొన్నాళ్ల తర్వాత.. రాజేంద్రన్ పొదుపు చేసిన సొమ్ముతో చిన్న బంగారు రిటైల్ దుకాణాన్ని ప్రారంభించారు. అలా 1964లో రూ.100 అద్దెతో 500 చదరపు అడుగుల స్టోర్‌తో GR తంగమాలిగైగా కంపెనీని ప్రారంభించారు. GRT ఒక పెద్ద దుకాణాన్ని ప్రారంభించడంతో 1979లో పెద్ద మైలురాయిని అందుకుంది.
ఏళ్ల తరబడి కృషితో వ్యాపారంలో నమ్మకమైన వినియోగదారులను భారీగా సంపాదించుకున్నారు. అలా కంపెనీని ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా నిలిపారు. బంగారం, వెండి, డైమండ్స్, ప్లాటినం ఆభరణాల విక్రయంతో ముందుకు కొనసాగారు. దాదాపు 60 ఏళ్ల కంపెనీని ప్రస్తుతం రాజేంద్రన్ కుమారులు GR అనంతపద్మనాభన్, GR రాధాకృష్ణన్ నడుపుతున్నారు. వీరిద్దరూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాజేంద్రన్ చెన్నైకి సమీపంలోని GRT ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చైర్‌పర్సన్ కూడా. రాజేంద్రన్ తన వ్యాపారాన్ని హాస్పిటాలిటీ రంగంలోకి విస్తరించి.. 14 నగరాల్లో రిసార్ట్‌లు, హోటళ్లను నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications