ఐపీఎల్‌ అంపైర్ జీతం ఎంతో తెలుసా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మించి సంపాదన..

Umpire Salary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ఈ నెల 22 నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌లో చాలా మంది ప్లేయర్స్ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు. ముఖ్యంగా ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్'గా నిలిచాడు. అయితే, ఈ లీగ్‌లో ప్లేయర్లతో పాటు అంపైర్లు కూడా చాల కీలకం. ఎందుకంటే మ్యాచ్‌ నిర్వహించడంలో అంపైర్లు కీలక పాత్ర పోషిస్తారు, కానీ ఈ అంపైర్లకు ఎంత జీతం వస్తుందో మీకు తెలుసా ?

do you know how much salary IPL umpires will get and how much they earn in a season

అనుభవం ఉన్న అంపైర్ల జీతం: మంచి పేరు పొందిన అలాగే అనుభవజ్ఞులైన IPL అంపైర్లలో అనిల్ చౌదరి, నితిన్ మీనన్ అండ్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ వంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఈ అంపైర్లకు ప్రతి మ్యాచ్‌కు దాదాపు రూ.1,98,000 జీతం చెల్లిస్తారు. 100కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన అనిల్ చౌదరి జీతం ద్వారా మంచి మొత్తాన్ని సంపాదిస్తాడు. ఎందుకంటే వీళ్ళ జీతం వారి అనుభవం ఇంకా గుర్తింపు పై ఆధారపడి ఉంటుంది.

తక్కువ అనుభవం ఉన్న అంపైర్ల జీతం : తక్కువ అనుభవం ఉన్న అంపైర్ల జీతం మ్యాచ్‌కు దాదాపు రూ.59,000 చెల్లిస్తారు. ఇందులో వీరేంద్ర శర్మ పేరు కూడా ఉంది, అతనికి కూడా ఇదే రేంజ్లో జీతం ఇవ్వబడుతుంది. అనుభవజ్ఞులైన అంపైర్లతో పోలిస్తే ఈ జీతం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మొత్తం కూడా ఇప్పటికీ మంచి ఆదాయంగా పరిగణించబడుతుంది.

ఐపీఎల్ సీజన్‌లో అంపైర్ల మొత్తం ఆదాయాలు: ఐపీఎల్ సీజన్‌లో అంపైర్ల మొత్తం సంపాదన వారి అనుభవం ఇంకా మ్యాచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. సగటున ఒక అంపైర్ సీజన్‌కు దాదాపు రూ.7,33,000 సంపాదించవచ్చు.

ప్లేఆఫ్‌లలో అదనపు ఆదాయాలు: ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయంలో అంపైర్లకు అదనపు బోనస్‌లు కూడా ఉంటాయి. ఈ బోనస్ వారి మొత్తం ఆదాయాలను మరింత పెంచుతుంది. అనుభవజ్ఞులైన అంపైర్లు ఒక సీజన్‌లో గొప్ప మొత్తాన్ని సంపాదించడానికి వీలు కల్పిస్తుంది.

అనిల్ చౌదరి అత్యంత ప్రసిద్ధ ఐపీఎల్ అంపైర్లలో ఒకరు, ఆయనకు 100 కి పైగా మ్యాచ్‌లలో అంపైరింగ్ చేసిన అనుభవం ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఆయన ప్రతి మ్యాచ్‌కు రూ. 3,46,000 జీతం పొందుతారు. నితిన్ మీనన్, బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ సహా చాల మంది ప్రముఖ అంపైర్లు ప్రతి మ్యాచ్‌కు రూ. 3.46 లక్షలు పొందుతారు. ఫైనల్‌ మ్యాచ్లో అంపైర్ రూ.6,94,000 వరకు జీతం అందుతుందని చెబుతారు. ఫెమస్ అంపైర్లు కూడా స్పాన్సర్‌షిప్ డీల్స్ నుండి కూడా సంపాదిస్తారని అలాగే ప్లేఆఫ్ మ్యాచ్‌ల సమయంలో అంపైర్లు రూ.5,20,000 వరకు అందుకుంటారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+