నిర్మలా సీతారామన్ దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా ? ఆమె లైఫ్ స్టయిల్, చదువు, ఆస్తులు ఇవే..
నిర్మలా సీతారామన్ భారతదేశపు మొట్టమొదటి ఫుల్ టైం మహిళా ఆర్థిక మంత్రి. ఫిబ్రవరి 1 శనివారం అంటే రేపు ఆమె 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం సామాన్యుల నుంచి బడా వ్యాపారవేత్తల వరకు అందరూ నిర్మలా సీతారామన్ ప్రకటనలపై ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈసారి బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు చేయనున్నారు ? దీని వల్ల ప్రజలకి మంచి జరుగుతుందనే ఆశ అందరిలోనూ ఉంది. అయితే నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి పదవిగా లైఫ్ స్టయిల్, ప్రస్తుత వేతనం, విద్యాభ్యాసం, నికర విలువ మొదలైన వాటి గురించి మీకోసం.
నిర్మలా సీతారామన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అత్యంత ప్రముఖ నాయకులలో ఒకరు అలాగే భారతదేశ రాజకీయ దృశ్యంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమె ఎదుగుదల ఒక చారిత్రాత్మక క్షణం, ఆమె భారతీయ చరిత్రలో పూర్తి సమయం పోర్ట్‌ఫోలియోను కేటాయించిన మొదటి మహిళ.

నిర్మలా సీతారామన్ విద్య ఇంకా వ్యక్తిగత జీవితం: తమిళనాడులోని మధురైలో 18 ఆగస్టు 1959న జన్మించిన సీతారామన్, రైల్వే ఉద్యోగి నారాయణన్ సీతారామన్, గృహిణి అయిన సావిత్రి దంపతులకు జన్మించారు. ఆమె ముసిరి, తిరుచిరాపల్లి, తిరువెంకాడు, తంజావూరు, సేలం జిల్లాల్లోని తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.
నిర్మల సీతారామన్ విద్యా ప్రయాణం ఆమెను చెన్నై, తిరుచిరాపల్లి నుండి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)కి తీసుకువెళ్లింది. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుండి అర్థశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, JNU నుండి ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ అండ్ M.Phil చేసింది. ఆమె తన భర్త పరకాల ప్రభాకర్‌ను మొదట జేఎన్‌యూలో కలిశారు. వీరికి భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ప్రభాకర్ 1986లో బీజేపీలో చేరిన సీతారామన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పరకాల వాంగ్మయి అనే కుమార్తె ఉంది.
నిర్మలా సీతారామన్ రాజకీయ జీవితం: నిర్మల సీతారామన్ గతంలో వాణిజ్యం & పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. ఆమె రాజకీయ జీవితంలో 2003 నుండి 2005 వరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బిజెపికి అధికార ప్రతినిధిగా ఉన్నారు.
నిర్మలా సీతారామన్ మొత్తం ఆస్తుల విలువ: Myneta.info ప్రకారం, నిర్మలా సీతారామన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 2,63,77,861. ఇందులో చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె దగ్గర 315 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి ఉంది. సొంతంగా మారుతి సుజుకి డిజైర్ ధర రూ.7,33,187, హ్యుందాయ్ ఐ10 ధర రూ.3,96,400. ఇంకా హైదరాబాద్ సమీపంలో దాదాపు రూ.16 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉంది. ఆమె స్థిరాస్తి విలువ రూ.1,98,72,000గా సమాచారం.
ఆమె తన రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్‌లో తన దగ్గర రూ.43,500 నగదు, రూ.79,524 బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, ఎల్‌ఐసి వంటి ఇతర బీమాలు రూ.4,43,500 ఉందని చెప్పారు.
నిర్మలా సీతారామన్ భారత ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన పోస్టులలో ఒకటిగా ఎదిగారు, ఆమె ప్రతిభ దేశవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిస్తోంది. మధ్యతరగతి నేపథ్యం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆర్థిక మంత్రి అయ్యే వరకు ఆమె మార్గం ఆమె రాజకీయ చరిత్ర, అంకితభావం, తెలివితేటలను ప్రతిబింబిస్తుంది.
నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్: ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2025న ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం చేస్తారు. ఈ ఎనిమిదవ బడ్జెట్ ప్రసంగంలో, పారిశ్రామికవేత్తలు, పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను మినహాయింపు, కాపెక్స్ పుష్, GST హేతుబద్ధీకరణ, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఇతర కీలక ప్రకటనలను కూడా ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications