ఆరోగ్య బీమాలో రకాలు.. తెలుసుకుంటే మీకే మేలు

ఇప్పుడున్న కాలంలో అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. కొత్తకొత్త వ్యాధులతో జనాలు ఆస్పత్రుల పాలవుతున్నారు. హాస్పిటల్ బిల్లుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురు కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య బీమా పాలసీల అవసరం ఎక్కువగా ఏర్పడుతోంది. ఈ పాలసీలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి. వీటి కోసం కొంత సొమ్ము చెల్లించడం ద్వారా ఎక్కువ మొత్తానికి బీమా రక్షణను పొందడానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా లేదా అనారోగ్యం పాలయి హాస్పిటల్ లో చేరాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా బిల్లుల రూపంలో పడే ఆర్ధిక భారాన్ని ఆరోగ్య బీమా తగ్గిస్తుంది. అందుకే బీమా తీసుకోవాలనే వారి సంఖ్య పెరుగుతోంది. బీమా పాలసీని ఆన్ లైన్ ద్వారా ఏజెంట్స్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ బీమా పాలసీలను ఒక్కరికే కాకుండా కుటుంబం మొత్తానికి తీసుకోవాలనుకునే సమయంలో ఎలాంటి పాలసీని తీసుకోవాలో ముందుగానే తెలుసుకోవాలి. ఆరోగ్య బీమాలో చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామా...

ఆరోగ్య బీమా పాలసీల్లో రకాలు

ఆరోగ్య బీమా పాలసీల్లో రకాలు

1. ఇండెమ్నిటీ ప్లాన్లు

2. డెఫినిట్ బెనిఫిట్ ప్లాన్లు

ఇండెమ్నిటీ ప్లాన్లు

ఈ ప్లాన్లు సాంప్రదాయ ఆరోగ్య బీమా ప్లాన్లు. ఈ ప్లాన్లు బీమా తీసుకునే సమయంలో ఎంత సమ్ అష్యురెన్స్ ఉంటుందో ఆ మేరకు కవరేజీ ని అందిస్తాయి. అవి..

ఇండివిడ్యువల్ కవరేజీ

ఇండివిడ్యువల్ కవరేజీ

ఇది ఇండివిడ్యువల్ గా మాత్రమే వర్తిస్తుంది. హాస్పిటల్ లో చేరినప్పుడు ఈ పాలసీ కింద పరిహారాన్ని పొందవచ్చు. బేసిక్ సమ్ అష్యురెన్సు ఎంత ఉంటుందో అంత మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజీ

ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజీ

ఇది కుటుంబం మొత్తానికి సంబందించినది. ఒక్క ప్లాన్ కింద మొత్తం కుటుంబానికి కవరేజీ లభిస్తుంది. సమ్ ఇన్సూరెన్స్ ఎంతయితే ఉంటుందో అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ కింద పాలసీ తీసుకుంటే వ్యక్తులు లేదా మెడిక్లైయిం పాలసీలకన్నా తక్కువ ప్రీమియం ఉంటుంది.

మెడిక్లైయిమ్ ఇన్సూరెన్స్

మెడిక్లైయిమ్ ఇన్సూరెన్స్

ఈ బీమా హాస్పిటల్లో చేరినప్పుడు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. ఇందులో నర్సింగ్ చార్జీలు, సర్జరీ వ్యయాలు, డాక్టర్ ఫీజులు, ఆక్సిజెన్, అనిస్తీషియా వంటివి ఉంటాయి.

గ్రూప్ మెడిక్లైయిం

గ్రూప్ మెడిక్లైయిం

చాలా కాలంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్లకు ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోంది. చిన్న, మధ్య తరహా నుంచి పెద్ద కంపెనీల వరకు ఈ పాలసీలను తమ ఉద్యోగులకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలాంటి పాలసీల వల్ల ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం లభిస్తోంది. ఈ పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది.

యూనిట్ లింక్డ్ హెల్త్ ప్లాన్లు

యూనిట్ లింక్డ్ హెల్త్ ప్లాన్లు

యూనిట్ లింక్డ్ ప్లాన్లను యులిప్స్ అంటారు. ఈ ప్లాన్లు పెట్టుబడితో పాటు బీమా సదుపాయాన్ని కల్పిస్తాయి. కాబట్టి రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్లాన్ కింద ప్రీమియంను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కోసం వినియోగిస్తారు. బీమా కవరేజీని అందిస్తారు. మార్కెట్ పని తీరును బట్టి రాబడి ఆదరపడి ఉంటుంది.

డెఫినిట్ బెనిఫిట్ ప్లాన్స్

డెఫినిట్ బెనిఫిట్ ప్లాన్స్

ఈ ప్లాన్ల కింద అనారోగ్యానికి గురైన సందర్భంలో ఇక మొత్తంగా బీమా తీసుకున్న వారికీ పరిహారాన్ని అందిస్తారు. ఇందులో మూడు రకాల ప్లాన్లు ఉన్నాయి. అవి క్రిటికల్ ఇల్ నెస్ ప్లాన్, వ్యక్తిగత ప్రమాద ప్లాన్, హాస్పిటలైజేషన్ క్యాష్ బెనిఫిట్ ప్లాన్ వంటివి ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+