చదువుకునే వారి కలలకు రెక్కలు.. ఈ స్కింతో కాలేజ్, హాస్టల్, ఫుడ్ అన్ని ఖర్చులపై నో టెన్షన్..
ఈ రోజుల్లో విద్య అనేది ఒక ఆయుధం. దేశంలో నిరక్షరాభ్యాసత శాతం లేకుండా అందరు చదువుకోవాలి అలాగే విద్యకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు అనే ఆలోచనతో ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. ఉచిత విద్య నుండి విదేశాల్లో చదివే ఉన్నత విద్య వరకు కావాల్సిన సహాయం కూడా ప్రభుత్వం అందిస్తుంది. గొప్పగా చదువుతూ మంచి మార్కులు సాధించి ఉన్నత చదువుల కోసం ఆర్ధికంగా వెనకబడ్డ లేదా ఆర్ధిక స్థోమత లేక పై చదువులు చదవలేకపోతున్న వారి కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప స్కిం తీసుకొచ్చింది.
అదేంటంటే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించింది. ఈ గొప్ప పథకం ఏంటో మీకు తెలుసా ? ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకం కింద ఉన్నత విద్యలో ఎంట్రన్స్ పొందే ఏ విద్యార్థి అయినా ఈ పథకం కింద ఫీజులు, ఇతర ఖర్చుల కోసం మొత్తం అందించేందుకు ఎలాంటి పూచీదారులు లేకుండా బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థల నుండి లైన్ తీసుకోవచ్చు. ఈ లోన్ పొందడానికి అర్హులు ఎవరు, ఈ పథకం కింద ఎంత వరకు లోన్ లభిస్తుంది అంటే..

పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఎడ్యుకేషన్ లోన్
నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ప్రకారం భారతదేశంలోని టాప్ 860 మంచి ఉన్నత విద్యా సంస్థలలో (QHEIs) అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద లోన్ తీసుకోవడానికి కుటుంబ ఆదాయం అవసరం లేదు. అన్ని ఆదాయ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ పథకం కింద లోన్ తీసుకోవడానికి అర్హులు.
ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకం కింద లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ఉన్నత విద్యా శాఖ "పిఎం-విద్యాలక్ష్మి" అనే వెబ్ సైట్ ప్రారంభించింది, దీని ద్వారా విద్యార్థులు లోన్లు ఇంకా వడ్డీ రాయితీ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని బ్యాంకులు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తాయి. వడ్డీ రాయితీ ఇ-వోచర్లు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) వాలెట్లను ఉపయోగించి చెల్లిస్తుంది.
లోన్ ఎంత, వడ్డీ రేటు ఎంత?
పీఎం విద్యాలక్ష్మి యోజన కింద మీరు పొందగలిగే విద్యా రుణంపై ఎంత మొత్తం అనే పరిమితి లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్లు వసూలు చేసే కోర్సు ఫీజులు, ఇతర ఫీజులపై ఆధారపడి ఉంటుంది ఇంకా కోర్సు సమయంలో విద్యార్థికి అవసరమైన మెస్, హాస్టల్ ఫీజు అలాగే ఖర్చులకు తగిన మొత్తం ఉంటుంది. అయితే, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల వరకు ఉండి, మంచి ఉన్నత విద్యా సంస్థ నుండి కోర్సు చదువుతున్న విద్యార్థి రూ. 10 లక్షల వరకు విద్యా రుణంపై 3% వడ్డీ రాయితీని పొందేందుకు అర్హులు. విద్యా రుణం మొత్తం రూ. 10 లక్షలు దాటితే, రూ. 10 లక్షల వరకు రుణం మొత్తం అసలు మొత్తంపై వడ్డీ రాయితీ అందిస్తారు.


Click it and Unblock the Notifications