దుబాయ్ వెళ్లే ప్లాన్ చేస్తున్నారా..? ఇప్పుడు అంతే ఈజీ కాదు..ఈ వివరాలు చెప్పాల్సిందే..
మన భారతీయులు ఫెస్టివల్ సీజన్ లేదా హాలిడేస్ టైంలో ఎక్కడైనా టూర్ వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మరికొందరు ఫారెన్ దేశాలకు వెళ్లేందుకు ప్లాన్స్ చేస్తుంటారు. టూర్ వెళ్లిన తరువాత షాపింగ్ చేయకుండా ఎవరు ఉంటారు చెప్పండి. అయితే ఇలా షాపింగ్ కోసం వెళ్ళేవాళ్ళకి దుబాయ్ గవర్నమెంట్ షాకిచ్చింది.
దుబాయ్ ప్రభుత్వం తాజాగా వీసా పాలసీలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టింది, దింతో దుబాయ్ వెళ్లాలనుకునే భారతీయులకు ఇబ్బందులు ఎదురవవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 8 నుంచి జనవరి 14 వరకు దుబాయ్‌లో షాపింగ్ ఫెస్టివల్ జరగనుంది. చాలా మంది భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన షాపింగ్ ఫెస్టివల్ లో ఇది ఒకటి. అందుకే చాలా మంది భారతీయులు ఈ టైంలో దుబాయ్ వెళ్లాలని ప్లాన్స్ చేస్తుంటారు.

దీని ప్రకారం భారత్ నుంచి దుబాయ్ వెళ్లాలనుకునే వారు అక్కడ ఉండేందుకు హోటల్ రిజర్వేషన్, రిటర్న్ టికెట్‌తో సహా వివరాలను అందించాలి. అదేవిధంగా భారత్ నుంచి దుబాయ్ వెళ్లే వారు అక్కడ ఉంటున్న ఇంటి రెంట్ డీడ్, వారి ఎమిరేట్స్ ఐడీ, రెసిడెంట్ వీసా కాపీ ఇంకా ఇతర వివరాలు తెలపాలంటూ దుబాయ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులు.. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న భారతీయులు ఇప్పుడు ఇబ్బందుల్లో పడవచ్చు. హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్ మొదలైనవి అడగడం సరైనదే, కానీ చాలా మంది భారతీయ ప్రయాణికులు మనం ఉండబోయే బంధువుల గుర్తింపు డాకుమెంట్స్ అడగడం సరికాదని భావిస్తున్నారు.
అందువల్ల బంధువుల ఇళ్లలో ఉండకుండా హోటళ్లలో ఉండాల్సి రావచ్చని, దీంతో వారి టూరిజం ఫీజు మరింత పెరిగే అవకాశం ఉందని ఒడిసి టూర్స్ అండ్ ట్రావెల్స్ డైరెక్టర్ నిఖిల్ ఠాగూర్ దాస్ తెలిపారు. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్న వ్యక్తి హోటల్‌లో ఉండాలనుకుంటే ఒక రాత్రికి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుందని, అంతేకాకుండా దుబాయ్‌లో ఉంటున్న వారు వారి ఎమిరేట్స్ ఐడీ, రెంట్ డీడ్‌ను షేర్ చేయడానికి ఇష్టపడరని ఆయన చెప్పారు.

అందువల్ల ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు దుబాయ్ వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పర్యాటక రంగం పేర్కొంది. ముఖ్యంగా భారతదేశం నుండి చాలా మంది వ్యక్తులు కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లడం, టూరిజం ప్లేసెస్ చూడటం అలవాటు చేసుకున్నారు. కానీ ఈ కొత్త వీసా విధానాలతో ఇప్పుడు వెళ్లడం అంత ఈజీ కాదు.
దుబాయ్‌కి టూరిజం కోసం వెళ్లి హోటల్‌లో ఉండి తిరిగి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ స్నేహితులు ఇళ్లలో లేదా బంధువుల వద్ద ఉండేందుకు ఆలోచనతో అక్కడికి వెళ్లే వారికి ఈ కొత్త వీసా విధానం పెద్ద సమస్యగా మారింది.


Click it and Unblock the Notifications