CIBIL Score: పదే పదే క్రెడిట్ స్కోర్ చెక్ చేయటం మానేయండి.. ఎంత నష్టమో తెలుసా..?
CIBIL Score: బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడానికి మీ క్రెడిట్ స్కోర్ చాలా సహాయపడుతుంది. ఇప్పుడు చాలా క్రెడిట్ బ్యూరో కంపెనీలు క్రెడిట్ స్కోర్‌ని ఉచితంగా అందజేస్తున్నాయి. స్కోర్‌ని తరచుగా చెక్ చేసుకుంటూ ఉంటే.. ఈ అలవాటును వదిలివేయండి. ఇది మీకు ఎలాంటి నష్టాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

కెనరా బ్యాంక్ మేనేజర్ మాట..
క్రెడిట్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తాయని కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ విశాల్ తెలిపారు. అయితే దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్‌ను పదేపదే తనిఖీ చేస్తున్నట్లయితే.. వారు లోన్ పొందడంలో సమస్యలను ఎదుర్కోవచ్చని అన్నారు. దీని కారణంగా బ్యాంకు వారి క్రెడిట్ స్కోర్‌లో కొన్ని పాయింట్లను తీసివేస్తుందని వెల్లడించారు. మీరు రుణం తీసుకోవాలనుకుంటే.. వెంటనే మీరు క్రెడిట్ స్కోర్‌ను తరచుగా చెక్ చేసే అలవాటును మానుకోవాలన్నారు. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి 5 మార్గాలను సూచించారు.

నివేదికను సమీక్షించటం..
ముందుగా మీరు క్రెడిట్ స్కోర్‌ని సమీక్షించుకోండి. మీరు ఎక్కడ మెరుగుపరచాలో చూడండి. క్రెడిట్ స్కోర్‌లలో తప్పులు సాధారణం. మీ పేరు మీద ఎవరైనా మోసపూరితంగా రుణం తీసుకోవడం చాలా సార్లు జరుగుతుంది. మీరు స్కోర్‌లో అలాంటి పొరపాటును కనుగొంటే వెంటనే.. క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేసి సరిదిద్దుకోండి. డేటాను అందించేటప్పుడు బ్యాంక్ చేసిన పొరపాటు వల్ల ఇది జరుగుతుంటాయి.

ఎక్కువ లోన్ దరఖాస్తులు వద్దు..
రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. మీరు మళ్లీ మళ్లీ రుణాల కోసం దరఖాస్తు చేస్తే అది మీ క్రెడిట్ స్కోర్‌లో ప్రతిబింబిస్తుంది. దాని వల్ల మీ స్కోర్ కొంత ప్రభావితం అవుతుంది. మీరు అనేక దరఖాస్తు చేస్తున్నట్లయితే.. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు బ్యాంక్ భావిస్తుంది. దీని వల్ల లోన్ రిజెక్ట్ అవ్వవచ్చు.

పాత రికార్డులు..
మీకు గత క్రెడిట్ హిస్టరీ రికార్డు ఖచ్చితంగా ఉంటే తప్ప మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడదు. దీని కోసం మీరు మునుపటి రికార్డును తనిఖీ చేయాలి. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించినట్లయితే, ఆ రుణ ఖాతాను మూసివేయండి. ఇది క్లోజ్ కాకపోతే బ్యాంకులో ఫిర్యాదు చేయండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది.

క్రెడిట్ వినియోగం తగ్గించండి..
ట్రాన్స్ యూనియన్ CIBIL నివేదికలో మీ క్రెడిట్ వినియోగాన్ని తనిఖీ చేయండి. క్రెడిట్ కార్డ్ పరిమితిలో 30-35% మాత్రమే ఉపయోగించాలి. మీరు ఎక్కువగా ఉపయోగించినట్లయితే.. కనీసం 50% కంటే తక్కువకు తీసుకురావడానికి ప్రయత్నించాలని బ్యాంక్ అధికారి వెల్లడించారు.


Click it and Unblock the Notifications