Gold Loans: బ్యాంకుల్లో 24 క్యారెట్ల బంగారానికి లోన్లు ఇవ్వరా..!
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చాలా మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. పైగా చాలా బ్యాంకులు తక్కువ వడ్డికే రుణాలు అందిస్తున్నాయి. బంగారం రుణాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే ఏ బంగారానికైనా రుణాలు ఇస్తారా అనేది చాలా మందికి సందేహాలు ఉన్నాయి. సాధారణంగా బ్యాంకులు ఆభరణాలకు లోన్లు ఇస్తాయి. అంటే 22 క్యారెట్ల బంగారానికి బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు రుణాలు ఇస్తాయి. మరి 24 క్యారెట్ల బంగారానికి రుణాలు రావా అని డౌట్ ఉంటుంది.
బ్యాంకులు చాలా వరకు 24 క్యారెట్ల బంగారానికి రుణాలు ఇవ్వవు. అందుకే బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకుని బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు బంగారు రుణాలు ఇస్తాయి. మీరు బ్యాంకు బంగారం తీసుకెళ్లినప్పుడు మొదటగా దాని క్వాలిటీ చెక్ చేస్తారు. ఆ తర్వాత మీ బంగారు ఆభరణంలో పూసలు, రాళ్లు ఉంటే వాటి తరుగు తీసేసి బరువు జోగుతారు. ఉదాహరణకు మీరు ఒక తులం 22 క్యారెట్ల బంగారం పై లోన్ తీసుకుంటే మీరు ఆ పసిడి విలువలో 60 శాతం నుంచి 70 శాతం వరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. మీకు రూ.80 వేల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది.

మరి 24 క్యారెట్ల బంగారంపై లోన్ ఇవ్వరా అంటే.. 24 క్యారెట్ల పసిడి అనేది రా గోల్డ్. అంటే ఇది చిన్న సైజులో ఉంటుంది. పేరు కూడా బంగారం అని రాసుకోవాలి తప్ప దానికి ప్రత్యేక పేరు ఉండదు. అందుకే 24 క్యారెట్ల బంగారంపై లోన్ ఇవ్వరని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మీరు 24 క్యారెట్ల బంగారాన్ని ఒక కడెం లాగా చేసుకుని బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మీరు మీ వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ఉంది.
అది భద్రంగా ఉండాలంటే బ్యాంకులోనే ఉండాలి. దీని కోసం బ్యాంకులో లాకర్ తీసుకుని బంగారాన్ని దాచుకోవచ్చు. బంగారమే కాదు.. బంగారు ఆభరణాలు కూడా దాచుకోవచ్చు. ఇందుకు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. బంగారం రుణాలు దీర్ఘకాలిక రుణాలు కాదు. రుణాలను 6 నెలల లేదా సంవత్సరం లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే మీ బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications