For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

45 శాతం తగ్గిన డీ-మార్ట్ రెవెన్యూ, మే లో మాత్రం 17 శాతం పైగా పెంపు..

|

సామాన్యుడి నిత్యావసరాల సరుకుల స్టోర్.. డీ మార్ట్ ఏప్రిల్ నెలలో రెవెన్యూ భారీగా పడిపోయింది. 45 శాతం రెవెన్యూ తగ్గిందని డీ మార్ట్ నిర్వాహకులు ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రకటించింది. డీ మార్ట్‌కు 214 స్టోర్లు ఉండగా.. సగానికి పైగా స్టోర్లు తెరచుకోలేదు. నిత్యావసర వస్తువులు తప్ప ఇతర వస్తువులు విక్రయించకపోవడంతో మార్జిన్ తగ్గింది. లాక్ డౌన్ 4.0లో నిత్యావసరాలు కానీ వస్తువులను కూడా విక్రయించడం వల్ల మే నెలలో 35 శాతం వాటా పెరిగిందని తెలిపింది. మే 14 రోజుల్లో.. ఏప్రిల్ కంటే 17 శాతం రెవెన్యూ పెరిగిందని వివరించింది.

ఏప్రిల్‌లో విక్రయాలు జరగలేదు.. అలాగే తమ కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా 70 శాతం మంది విధులకు హాజరుకాలేదని వివరించింది. కానీ లాక్ డౌన్ 4.0 సడలింపులతో పరిస్థితి మారిందని పేర్కొన్నది. ఉత్పత్తిదారులు ఫ్యాక్టరీలు తెరవడం.. సరకు రవాణా వాహనాలకు స్థానిక సిబ్బంది అనుమతిస్తున్నానరని పేర్కొన్నది. దీంతో సరఫరా పెరిగిందని.. నిత్యావసరాలు కానీ వస్తువులను కూడా విక్రయిస్తున్నామని తెలిపారు. జనవరి మార్చి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 23 శాతం పెరిగి.. 6 వేల 194 కోట్లకు చేరిందని వివరించింది.

dmart revenue decreased 45 per in april month

కరోనా వైరస్ నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటూనే.. విక్రయాలు పెంచే ప్రణాళికలను రూపొందిస్తున్నామని డీ మార్ట్ పేర్కొన్నది. భవన నిర్మాణ పనులు నెమ్మదించాయని.. దీంతో కొత్త స్టోర్ల ప్రారంభం లేట్ అయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నది.

English summary

45 శాతం తగ్గిన డీ-మార్ట్ రెవెన్యూ, మే లో మాత్రం 17 శాతం పైగా పెంపు.. | dmart revenue decreased 45 per in april month

dmart revenue decreased 45 per in april month and may month revenue will short increased
Story first published: Monday, May 25, 2020, 22:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X