DMart: ఇదీ డీమార్ట్ బిజినెస్ సీక్రెట్.. దమానీది మామూలు బ్రైన్ కాదుగా..
DMart: పట్టణ ప్రజలు ఎప్పటికప్పుడు డీమార్ట్ కు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం నిత్యకృత్యమే. అయితే పల్లెలకూ ఈ పేరు బాగానే విస్తరించింది. నిత్యావసరాలు, బట్టలు సహా ఆయా ఉత్పత్తులు సంవత్సరం పొడవునా భారీ తగ్గింపుకు అందించడమే డీమార్ట్ ప్రత్యేకత. ఆ విధంగా ఎలా చేయగలుగుతుందో తెలుసా..?
డీమార్ట్ వ్యవస్థాపకులు రాధాకిషన్ దమానీ ఓ ప్రముఖ ఇన్వెస్టర్. ఆయన ముందుచూపు, వ్యాపార చతరతే తన రిటైల్ చైన్ సక్సెస్ కు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలతోనే సంపద పరంగా అజయ్ పిరమిల్, రాహుల్ బజాజ్, అనిల్ అగర్వాల్ వంటి భారతీయ బిలియనీర్లను వెనక్కునెట్టి ముందుకు దూసుకెళ్లారు.

2017లో తన సూపర్ మార్కెట్ చైన్ డీమార్ట్ IPOని ప్రారంభించారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 300 కంటే ఎక్కువ స్టోర్లు దీని సొంతం. ఇతర రిటైల్ చైన్ లు తమ మొత్తం టర్నోవర్ లో 3 నుంచి 4 శాతం అద్దెల కోసం వెచ్చిస్తూ ఉంటాయి. కానీ డీమార్ట్ తన రియల్ ఎస్టేట్ విభాగం ద్వారా సరసమైన ధరలకు భూమిని కొనుగోలు చేస్తోంది. తద్వారా ఆ అద్దె ఖర్చులను ఆదా చేసుకోగలుగుతుంది.
ఈ విధంగా డీమాట్ తన అద్దెలతో పాటు సిబ్బంది ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు IDBI క్యాపిటల్ మార్కెట్స్ లోని FMCG లీడ్ అనలిస్ట్ వరుణ్ సింగ్ తెలిపారు. ఆ విలువలో కొంత వినియోగదారులకు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. వేర్ హౌస్ కార్యకలాపాల కోసం క్లస్టర్ విధానాన్ని ఎంచుకోవడంతో సరుకు తరలింపు ఖర్చులూ భారీగా ఆదా చేసుకోవడమూ మరో కీలక కారణంగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications