DMart Q4 net profit: దమ్ము చూపిన దమాని: కరోనా కాలంలోనూ కాసుల వర్షం

ముంబై: డీ మార్ట్. మెట్రో నగరాలు, ఓ మోస్తరు పట్టణవాసులకు చిరపరిచితమైన పేరు. బహిరంగ మార్కెట్‌తో పోల్చుకుంటే అన్ని రకాల నాణ్యమైన వస్తువులను కాస్త తక్కువ ధరకే, ఒకేచోట లభించే హైపర్ రిటైల్ చైన్ మార్కెట్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ హైపర్ చైన్ మార్కెట్లను లీడ్ చేస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దమ్ము చూపింది. నెట్ ప్రాఫిట్‌లో 53 శాతం పురోభివృద్ధిని సాధించింది. 414 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అంచనాలకు అనుగుణంగా డీమార్ట్ రాణించినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 414 కోట్ల రూపాయలతో 53 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ వెల్లడించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోల్చుకుంటే 143 కోట్ల రూపాయలు అధికం. గత ఏడాది ఇదే కాలానికి డీమార్ట్ 271 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ సారి ఈ మొత్తం 414 కోట్ల రూపాయలకు చేరింది.

DMart Q4 net profit jumps 53 percent as Rs 414 Crore over 80 percent stores disrupted by Covid19

మొత్తం ఆదాయంలో 19 శాతం మేర వృద్ధి కనిపించింది. 7,460 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 6,291 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఏడాది మొత్తానికి నమోదైన రాబడి ట్యాక్సులు పోనూ 7,412 కోట్ల రూపాయలుగా తేలింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 1,156 కోట్ల రూపాయలు అధికం. గత ఆర్థిక సంవత్సరంలో డీమార్ట్ మొత్తం రాబడి 6,256 కోట్ల రూపాయల వద్ద నిలిచింది. ఏడాది తిరిగే సరికి ఈ సంఖ్య 7,460 కోట్ల రూపాయలకు చేరింది.

DMart Q4 net profit jumps 53 percent as Rs 414 Crore over 80 percent stores disrupted by Covid19

ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్, డిప్రియేషన్స్ అండ్ అమోర్టైజేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి డీమార్ట్ ఆర్జించిన ఆదాయం 613 కోట్ల రూపాయలు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 417 కోట్ల రూపాయల వద్ద నిలిచింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలాకాలం నుంచి దేశవ్యాప్తగా డీమార్ట్‌కు చెందిన హైపర్ రిటైల్ అవుట్‌లెట్లు వందశాతం నడవట్లేదు. 20 శాతం వరకు రిటైల్ అవుట్‌లెట్లు మూతపడ్డాయి. 80 శాతం మాత్రమే పనిచేస్తోన్నాయి. అయినప్పటికీ 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే అంచనాలకు మించిన ఆదాయాన్ని నమోదు చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+