For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Radhakishan Damani: రికార్డు డీల్ చేసిన డీమార్ట్ ఓనర్ దమానీ.. ఎందుకలా చేశాడంటే..?

|

Radhakishan Damani: ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా గురువు డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ. ఆయన ఏం చేసినా అందుకు వెనుక పెద్ద కారణమే ఉంటుంది. పైగా ఈయన ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా.

భారీ రియల్టీ డీల్..

భారీ రియల్టీ డీల్..

తాజాగా ముంబైలో దమానీ 28 లగ్జరీ హౌసింగ్ యూనిట్లను కొనుగోలు చేశారు. సమాచారం ప్రకారం ఇది దేశంలోనే అతిపెద్ద ఆస్తి ఒప్పందాల్లో ఒకటిగా నిలుస్తోంది. కొన్ని రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విషయంలో మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుంచి లగ్జరీ ప్రాపర్టీల విక్రయం ద్వారా వచ్చే మూలధన ఆదాయాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టేందుకు గరిష్ఠ పరిమితిని రూ.10 కోట్లకు పరిమితం చేయటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

డీల్ వివరాలు..

డీల్ వివరాలు..

బయటకు వచ్చిన వివరాల ప్రకారం అదానీ కుటుంబ సభ్యులతో పాటు కంపెనీల పేరుపై ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ద్వారా 1,82,084 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను దాదాపుగా రూ.1,238 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్స్ ఫిబ్రవరి 3న జరిగినట్లు డాక్యుమెంట్లు ప్రకారం వెల్లడైంది. ఈ ప్రాపర్టీలు ముంబై ఒర్లిలోని అనీబిసెంట్ రోడ్ ఏరియాలో అపార్టుమెంట్ల కొనుగోలు జరిగింది.

మరిన్ని డీల్స్..

మరిన్ని డీల్స్..

మార్చి 31, 2023 నాటికి ఇలాంటి మరిన్ని డీల్స్ వెలుగులోకి రావొచ్చని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు కూడా రూ.400 కోట్ల విలువైన 7 ఆస్తులను దమానీ కొనుగోలు చేశారు. దమానీ నిర్వహిస్తున్న రిటైల్ వ్యాపారం డీ-మార్ట్ దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో సొంత స్టోర్లను కలిగి ఉంది. దమానీ సొంత ప్రాపర్టీల్లో స్టోర్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన బెంగళూరు, హైదరాబాద్, పూణె, ముంబై వంటి నగరాల్లో రియల్టీ ప్రాపర్టీలను సైతం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

English summary

Radhakishan Damani: రికార్డు డీల్ చేసిన డీమార్ట్ ఓనర్ దమానీ.. ఎందుకలా చేశాడంటే..? | DMart owner Radhakishan Damani purchased 28 luxury apartments worth 1238 crores in mumbai

DMart owner Radhakishan Damani purchased 28 luxury apartments worth 1238 crores in mumbai
Story first published: Monday, February 6, 2023, 10:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X