Radhakishan Damani: ఒకప్పుడు కేవలం స్టాక్ మార్కెట్లో ప్రఖ్యాత ట్రేడర్ గా, బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకి గురువుగా స్టాక్ మార్కెట్ ప్రపంచానికి తెలుసు. అయితే ఆయనకు చెందిన అవెన్యూ సూపర్ మార్ట్ కింద నడుపుతున్న డీమార్ట్ స్టోర్లు ప్రతి సామాన్యుడికీ పరిచయమే.
అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ భారతదేశపు అతిపెద్ద రిటైల్ దిగ్గజం డీమార్ట్ బ్రాండ్స్ మాతృ సంస్థ. దమానీ తన స్టోర్లను ఎక్కడ ఏర్పాటు చేసినా వాటిని సొంత స్థలంలోనే నిర్మిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా బయటకొచ్చిన రియల్ ఎస్టేట్ డేటా ప్రకారం ముంబైలో కంపెనీ 17 వాణిజ్య స్థలాలను దాదాపు రూ.88.74 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

దేశంలో అన్ని రిటైల్ స్టోర్ల కంటే తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయించటానికి వెనుక అసలు కారణం.. దుకాణాలను సొంత భవనాల్లో నిర్వహించటమే. దీనివల్ల రియల్ ఎస్టేట్ ఖర్చులను అదుపులో ఉంచుతుంది. దీంతో తక్కువ మార్జిన్లతో ఉత్పత్తులను విక్రయించటం ద్వారా డీమార్ట్ స్టోర్లకు తరలి వస్తుంటారు. ప్రస్తుతం ముంబైలో కొనుగోలు చేసిన 17 వాణిజ్య ప్లాట్ల మొత్తం వైశాల్యం 45,876.92 చదరపు అడుగులు.
ముంబైలోని కండివాలి వెస్ట్‌లోని బేస్‌మెంట్‌లో మూడు యూనిట్లు, గ్రౌండ్ ఫ్లోర్‌లో మూడు, మొదటి అంతస్తులో మూడు, రెండో అంతస్తులో ఎనిమిది యూనిట్లను దమానీ కౌరీ ల్యాండ్ డెవలపర్స్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డీల్స్ ఆగస్టు 24, 2023న జరిగాయని తెలుస్తోంది. దీనికి ముందు 2021లో కరోనా మహమ్మారి సమయంలో రూ.400 కోట్లు వెచ్చించి ఏడు ప్రాపర్టీలను దమానీ కంపెనీ ముంబైలో కొనుగోలు చేసింది. దీనికి ముందు డీమార్ట్ స్టోర్ల ఏర్పాటు కోసం ముంబై, హైదరాబాద్, పూణె, బెంగళూరు వంటి ప్రదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications