Radhakishan Damani: స్టాక్ మార్కెట్ల ప్రపంచంలో ఉన్న చాలా మందికి ఇన్వెస్టర్ రాధాకిషన్ ధమానీ తెలుసు. దివంగర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు గురువు ఈయన. అలాగే దేశంలో ప్రఖ్యాత రిటైల్ చైన్ డీమార్ట్ యజమాని కూడా.
అవెన్యూ సూపర్‌మార్ట్స్ కింద డీమార్ట్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని నడుపుతున్న రాధాకిషన్ దమానీ.. బెంగళూరుకు చెందిన బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రిటైల్ చైన్ హెల్త్ అండ్ గ్లోను కొనుగోలు చేశారు. రాజన్ రహేజా, హేమేంద్ర కొఠారి నుంచి దమానీ ఈ డీల్ పూర్తి చేశారు. ఈ డీల్ రూ.700-750 కోట్లకు జరిగినట్లు విషయం తెలిసిన వ్యక్తుల ద్వారా వెల్లడైంది. దీంతో బ్యూటీ ఉత్పత్తుల రంగంలో కూడా దమానీ అడుగుపెట్టారు.

బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రిటైల్ చైన్ హెల్త్ అండ్ గ్లో.. బాంబే స్వదేశీ స్టోర్స్ తర్వాత రాధాకిషన్ దమానీ చేసిన రెండవ పెద్ద డీల్. దమానీ 2015లో బాంబే స్వదేశీ స్టోర్స్‌ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హెల్త్ & గ్లో 1997లో ప్రారంభమైంది. కంపెనీ తన తొలి ఫిజికల్ స్టోర్ చెన్నైలో ప్రారంభించింది. అప్పటి నుంచి హెల్త్ అండ్ గ్లో బెంగళూరు, మంగళూరు, పూణే, ముంబై, కొచ్చి, కోల్‌కతా, భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్ నగరాల్లో మెుత్త 175 స్టోర్‌లను ప్రారంభించింది.
ప్రస్తుతం రాధాకిషన్ దమానీ నికర విలువ రూ.1,66,949 కోట్లుగా ఉంది. జూన్ 2023 త్రైమాసికం వరకు దమానీ 14 కంపెనీల షేర్లలో పెట్టుబడులను కలిగి ఉన్నట్లు కార్పొరేట్ షేర్ హోల్డింగ్ డేటా వెల్లడించింది. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లో దమానీకి గరిష్ఠ వాటా ఉంది. VST ఇండస్ట్రీస్‌లో ఆయన అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఇదే క్రమంలో ఇండియా సిమెంట్స్‌లో 21% వాటా కలిగి ఉన్నారు. రాధాకిషన్ దమానీ ఇండియా సిమెంట్స్‌లో అతిపెద్ద పబ్లిక్ (ప్రమోటర్ కాని గ్రూప్) పెట్టుబడిదారు. అలాగే దమానీకి టాటా గ్రూప్ చైన్ ట్రెంట్‌లో కూడా వాటాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications