Hurun Self Made: దేశంలో సంపన్నుల గురించిన ఆసక్తికరమైన జాబితాను హురున్ సెల్ఫ్ మేడ్ విడుదలైంది. ఆసక్తికరంగా ఇందులో ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, డీమార్ట్ స్టోర్ల వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ మెుదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
తన వ్యాపార సామ్రాజ్యాన్ని సొంతంగా నిర్మించుకున్న వ్యాపారవేత్తగా రిటైల్ చెయిన్ డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ నిలిచారు. రూ.2.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రాధాకిషన్ దమానీ హురున్ మిలీనియం 2023 టాప్-200 జాబితాలో మొదటి స్థానాన్ని పొందారు. ఇక రెండవ స్థానంలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ, సచిన్ బన్సాల్ నిలిచారు. వీరి మార్కెట్ క్యాప్ రూ.1,19,472 కోట్లుగా ఉంది.

మూడో స్థానంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు చెందిన దీపిందర్ గోయల్ రూ.86,835 కోట్ల మార్కెట్ క్యాప్‌తో నిలిచారు. అలాగే డ్రీమ్ 11 వ్యవస్థాపకులు హరీష్ జైన్, భవిత్ సేథ్ ఈక్విటీ సంపద విలువ రూ.66,452 కోట్లుగా ఉంది. నాలుగో స్థానంలో స్విగ్గీ వ్యవస్థాపకులు హర్ష్ మజేటి, నందన్ రెడ్డి నిలిచారు.
అలాగే టాప్-10లో రేజర్‌పేకు చెందిన హర్షిల్ మాథుర్, శశాంక్ కుమార్ రూ.62,384 కోట్లు, మాక్స్ హెల్త్‌కేర్ అభయ్ సోయి రూ.55,085 కోట్లు, Paytm విజయ్ శేఖర్ శర్మ రూ.54,328 కోట్లు, జేరోధాకు చెందిన నిఖిల్ సోదరులు రూ.50,630 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నట్లు హురున్ నివేదిక ప్రకారం వెల్లడైంది. మెుత్తం సంపన్నుల జాబితాలో 38 మంది కంపెనీల వ్యవస్థాపకులు IIT దిల్లీ నుంచి, 24 మంది IIT బాంబే నుంచి, 20 మంది IIT ఖరగ్‌పూర్ విద్యార్థులు ఉన్నారు.
ఇక నగరాల వారీగా జాబితాను పరిశీలిస్తే.. జాబితాలో ఉన్న వ్యవస్థాపకులు 23 నగరాలకు చెందినవారు. ఇందులో బెంగళూరు నుంచి 129 మంది, ముంబై నుంచి 78 మంది, గురుగ్రామ్-న్యూదిల్లీ ప్రాంతం నుంచి 49 మంది ఉన్నారు. ఈ జాబితాలో జెప్టో స్థాపకుకు కైవల్య వోహ్రా 21 ఏళ్లతో అత్యంత పిన్న వయస్కుడుగా నిలిచారు.


Click it and Unblock the Notifications