Realestate News: దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ది చెందుతోంది. కొనుగోలుదారుల నుంచి బలమైన డిమాండ్ ఉండటంతో ఆయా ప్రాజెక్టుల్లోని ఫ్లాట్స్ మరియు విల్లాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా DLF జరిపిన విక్రయాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. 1,113 లగ్జరీ అపార్ట్‌మెంట్లను ప్లాజెక్టు ప్రీ-లాంచ్ చేసిన 3 రోజుల్లోనే 7 వేల 200 కోట్లకు విక్రయించినట్లు రియాల్టీ మేజర్ DLF సోమవారం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాలను వెల్లడించింది.

ఈ రేంజ్‌లో విక్రయించడం DLFకు కొత్తేమీ కాదు. గత ఏడాది మార్చిలోనూ గురుగ్రామ్‌లోని తన హౌసింగ్ ప్రాజెక్ట్‌లో 7 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన 1,137 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను కూడా DLF 3 రోజుల్లోనే 8 వేల కోట్లకు విక్రయించింది. కాగా ఇప్పుడు 'DLF ప్రివానా సౌత్' అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది గురుగ్రామ్‌లోని సెక్టార్స్ 76 మరియు 77లోని 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 7 టవర్లతో కూడిన 4 BHK అపార్ట్‌మెంట్‌లు మరియు పెంట్‌హౌస్‌లు ఉన్నాయి.
'లగ్జరీ నివాసాల డెవలప్‌మెంట్ కోసం ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్‌కు ఈ ఘటన నిదర్శనం. బల్క్ బుకింగ్స్‌ను నివారించేందుకు ప్రతి కొనుగోలుదారుకు కేవలం ఒక యూనిట్‌ను మాత్రమే కేటాయించాం. వీటిలో దాదాపు 25 శాతం సేల్స్ NRIల నుంచే జరిగాయి' అని DLF హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ MD మరియు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి తెలిపారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications