Real Estate: 3 రోజుల్లో రూ.5,590 కోట్ల వ్యాపారం.. రికార్డు సృష్టించిన రియల్టీ కంపెనీ DLF.. స్టాక్
DLF Privana West: కరోనా తర్వాత దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధిని సాధిస్తోంది. చాలా మంది తమకు సొంత ఇల్లు చాలా ముఖ్యమని గ్రహించటంతో హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రధాన నగరాల్లో ప్రధానంగా 3BHK, 4BHKలకు డిమాండ్ ఊపందుకుంది.
తాజాగా దేశంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ తన లగ్జరీ రెసిడెన్స్ ప్రాజెక్ట్ DLF Privana Westలో భారీ విక్రయాలను నమోదు చేసింది. కేవలం మూడు రోజుల్లో కంపెనీ ప్రాజెక్టులోని 795 లగ్జరీ ఫ్లాట్లను రూ.5,590 కోట్లకు విక్రయించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. గురుగ్రామ్‌లో నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ సెక్టార్ 76,77లో సుమారు 12.572 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతోంది. ఇది డీఎల్ఎఫ్ ప్రవణలోని 116.296 ఎకరాల మెగా ప్రాజెక్టులో భాగంగా ఉంది. దీనికి ముందు జనవరి 2024లో DLF Privana south సైతం మంచి విక్రయాలను నమోదు చేసింది.

డీఎల్ఎఫ్ ప్రివానా వెస్ట్ ప్రాజెక్టులోని ప్రతి 4BHK యూనిట్‌కు మూడు కార్ పార్క్‌లు, పెంట్‌హౌస్‌ల కోసం నాలుగు కార్ పార్క్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మెుత్తం 5 టవర్లలో 795 నివాసాలను కలిగి ఉండనుంది. ఈ ప్రాజెక్ట్ 4BHK అపార్ట్‌మెంట్‌లు, పెంట్‌హౌస్‌ల విశిష్ట కలెక్షన్ కలిగి ఉండనుంది. ఇందులో రెండు నివాసాలు ఒకదానికొకటి కనిపించకుండా అత్యంత గోప్యతను నిర్ధారిస్తోంది.
ప్రాజెక్టులో కొనుగోలు చేసిన వారిలో, ఆసక్తి చూపిన వారిలో ఎక్కువ మంది NRIలు ఉన్నట్లు DLF హోమ్ డెవలపర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి. ఈ ప్రాజెక్టులో దాదాపు 80% విస్తీర్ణం బహిరంగ ప్రదేశానికి అంకితం చేయబడగా.. ఎకరానికి సగటున 63 నివాసాలను డీఎల్ఎఫ్ నిర్మిస్తోంది. దీంతో నేడు ఉదయం 10.40 గంటల సమయంలో డీఎల్ఎఫ్ లిమిటెడ్ కంపెనీ షేర్ ధర స్వల్ప లాభంతో రూ.857.85 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications