Diwali Muhurat Trading: ప్రతి ఏడాది మాదిరిగానే దీపావళికి కేవలం గంట పాటు నిర్వహించేందుకు దేశీయ స్టాక్ మార్కెట్లు సిద్ధమౌతున్నాయి. దీనిని ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ అని పిలుస్తారు.
ఈ ముహురత్ ట్రేడింగ్ సమయంలో ట్రేడింగ్ పెట్టుబడిదారులకు శ్రేయస్సును తెస్తుందని అనేక మంది నమ్ముతారు. ఈ సీజన్‌లో వ్యాపారం చేయడం వల్ల ఏడాది పొడవునా లాభాలు వస్తాయని అనేక మంది ట్రేడర్లు నమ్ముతారు. ఈ క్రమంలో నవంబర్ 12న దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ మార్కెట్‌లో ప్రత్యేకంగా ఒక గంట 'ముహురత్ ట్రేడింగ్' సెషన్‌ను నిర్వహిస్తాయి.

కేవలం గంట పాటు నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి 7.15 గంటల వరకు మాత్రమే జరుగుతుందని స్టాక్ ఎక్స్ఛేంజీలు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 15 నిమిషాల ప్రీ-ట్రేడింగ్ సెషన్ కూడా ఉంటుంది. హిందూ క్యాలెండర్ సంవత్సరం దీపావళి నుంచి ప్రారంభమవుతుంది. దీనిని సంవత్ అని పిలుస్తారు. ఏదైనా కొత్తగా ప్రారంభించేందుకు దీపావళి సరైన సమయమని మార్కెట్ విశ్లేషకులు చెబుతుంటారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్ 14న స్టాక్ మార్కెట్లు మూసివేయబడతాయి.
గత ఏడాది ముహూర్తపు ట్రేడింగ్‌లో మార్కెట్ 26 అక్టోబర్ 2022న నిర్వహించబడింది. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సమయంలో BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ పెరుగుదలతో ముగిశాయి. సెన్సెక్స్ 524.51 పాయింట్ల లాభంతో 59,831.66 వద్ద, నిఫ్టీ 154.45 పాయింట్లు పెరిగి 17730.75 వద్ద ముగిశాయి. 2021లో ముహురత్ ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 464.77 పాయింట్ల పతనంతో ముగియగా, నిఫ్టీ 252.90 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇక 2020, 2019లో దీపావళి ట్రేడింగ్ సమయంలో సూచీలు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications