న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (నవంబర్ 12) మధ్యాహ్నం గం.12.30కు మీడియా ముందుకు రానున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తోంది. ఇప్పటికే వివిధ రంగాలకు భారీ ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రం, డిమాండ్ పునరుజ్జీవం కోసం మరోసారి ప్యాకేజీని ప్రకటిస్తోంది.
ప్రారంభంలో రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ఉద్యోగులకు, ఎంఎస్ఎంఈలకు, చిన్న వ్యాపారులకు సహా వివిధ రంగాలకు ప్యాకేజీని ఇచ్చింది. గత నెలలో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు ఎల్టీసీ వోచర్‌ను తీసుకు వచ్చింది. నిన్న 10 రంగాలకు రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇప్పుడు దీపావళి బహుమతిగా మరో ప్యాకేజీతో ముందుకు వస్తున్నారు.
Nov 12, 2020, 3:16 pm IST
రూ. 3 లక్షల కోట్లతో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకాన్నివచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Nov 12, 2020, 3:06 pm IST
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 2.65 లక్షల కోట్లు ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
Nov 12, 2020, 2:50 pm IST
క్యాపిటల్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పెండిచర్ కోసం అదనంగా రూ.10,200 కోటాయిస్తున్నట్లు తెలిపారు.
Nov 12, 2020, 2:49 pm IST
ఇండియన్ కొవిడ్ న్యాక్సీన్ పరిశోన-అభివృద్ధి కోసం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు.
Nov 12, 2020, 2:21 pm IST
నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(NIIF) డెబిట్ ప్లాట్‌ఫాంలోకి రూ.6,000 కోట్ల ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నట్లు నిర్మల తెలిపారు.
Nov 12, 2020, 2:18 pm IST
రూ.2 కోట్ల వ్యాల్యూ వరకు సర్కిల్ రేటు, అగ్రిమెంట్ వ్యాల్యూను 10 శాతానికి బదులు 20 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.
Nov 12, 2020, 2:18 pm IST
వివాదం లేని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుందన్నారు. ఈఎండీకి బదులు బిడ్ సెక్యూరిటీ డిక్లరేషన్ సరిపోతుందన్నారు. 31 డిసెంబర్ 2021 వరకు ఈ ప్రయోజనాలు కొనసాగస్తామని తెలిపారు.
Nov 12, 2020, 2:14 pm IST
ప్రభుత్వ టెండర్లకు సంబంధించి పర్ఫార్మెన్స్ సెక్యూరిటీని 5 శాతం నుండి 10 శాతానికి బదులు 3 శాతానికి తగ్గించినట్లు నిర్మల తెలిపారు.
Nov 12, 2020, 2:13 pm IST
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద రూ.18,000 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు నిర్మల. ఈ అదనపు నిధుల వల్ల మరో 12 లక్షల ఇళ్లు పూర్తవుతాయని, మొత్తం 18 లక్షల ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు.
Nov 12, 2020, 2:03 pm IST
కామత్ కమిటీ గుర్తించిన ఒత్తిడిలో కూరుకుపోయిన వివిధ రంగాలకు క్రెడిట్ మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కరోనా కారణంగా 26రంగాలు భారీగా దెబ్బతిన్నట్లు కామత్ కమిటీ గుర్తించిందని తెలిపారు. ఇందులో హెల్త్ కేర్ సెక్టార్ కూడా ఉందన్నారు. ఈ పథకం కింద అదనపు క్రెడిట్ కాలపరిమితి 5 ఏళ్లుగా తెలిపారు. ఈ పథకంలో ప్రిన్సిపుల్ అమౌంట్ తిరిగి చెల్లించే కాలపరిమితిపై ఏడాది పాటు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ స్కీం మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకం అర్హత కోసం టర్నోవర్ పరిమితి లేదని తెలిపారు. 10 రంగాలకు ఆత్మనిర్భర్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీం లాంచ్ చేసినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:54 pm IST
ఒత్తిడిలో కూరుకుపోయిన రంగాలను గుర్తించి క్రెడిట్ మద్దతు ఇస్తామని తెలిపారు. ఒత్తిడిలో కూరుకుపోయిన రంగాలను కామత్ కమిటీ సూచించిందన్నారు.
Nov 12, 2020, 1:54 pm IST
ఈ స్కీంకు ఎంఎస్ఎంఈ యూనిట్లు, ముద్రా లోన్ రుణగ్రహీతలు, బిజినెస్ ఎంటర్ప్రైజెస్, బిజినెస్ ఇండివిడ్యువల్ లోన్స్ వంటివి ఈ స్కీంకు అర్హత కలిగినట్లు చెప్పారు.
Nov 12, 2020, 1:51 pm IST
ఎస్ఎంఎస్ఈలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ECLGS)ను మార్చి 31, 2021 వరకు పొడిగిస్తున్నట్లు నిర్మల తెలిపారు.
Nov 12, 2020, 1:47 pm IST
39.7 లక్షల ట్యాక్స్‌పేయర్స్‌కు రూ.1,32,800 కోట్ల ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్స్ చెల్లించినట్లు నిర్మల తెలిపారు.
Nov 12, 2020, 1:45 pm IST
మే నెలలో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ అభియాన్ మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు.
Nov 12, 2020, 1:43 pm IST
ఏదైనా కంపెనీ మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీలోపు ఉద్యోగం కోల్పోయిన వారిని ఎవరినైనా చేర్చుకుంటే కొన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇది నెలకు రూ.15,000 లోపు వేతనం ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు.
Nov 12, 2020, 1:40 pm IST
కరోనా నేపథ్యంలో ఇన్సెంటివ్స్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీస్ ఆత్మనిర్భర్ భారత్ రోజర్ యోజన ప్రారంభించినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:39 pm IST
అదనపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ట్రాన్సుపోర్ట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు రూ.25,000 కోట్లు సమకూర్చినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:35 pm IST
వడ్డీరహిత రుణాల కోసం 11 రాష్ట్రాలకు రూ.3,621 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:34 pm IST
ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ స్కీం కింద ఇప్పటి వరకు 61 లక్షల రుణగ్రహీతలకు రూ.2.05 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు నిర్మల తెలిపారు. ఇందులో రూ.1.52 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:32 pm IST
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్ఎస్లకు స్పెషల్ లిక్విడిటీ స్కీం ద్వారా రూ.7,227 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:26 pm IST
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.1700 కోట్లు శాంక్షన్ చేస్తున్నట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:25 pm IST
పీఎం-కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రూ.1.4 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:24 pm IST
నాబార్డు ద్వారా రైతులకు అడిషనల్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.25,000 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు
Nov 12, 2020, 1:23 pm IST
పీఎం-కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కోసం 183.14 లక్షల కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Nov 12, 2020, 1:22 pm IST
అక్టోబర్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగాయని, బ్యాంకు క్రెడిట్స్ 5.1 శాతం పెరిగిందని, ఎనర్జీ వినియోగం కూడా భారీగా పెరిగిందని నిర్మల తెలిపారు.
Nov 12, 2020, 1:21 pm IST
వన్‌నేషన్ - వన్ రేషన్ కిందకు 68.6 కోట్ల మంది భారతీయులు వచ్చారని నిర్మల తెలిపారు.
Nov 12, 2020, 1:20 pm IST
28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వన్ నేషన్-వన్ రేషన్ కిందకు తీసుకు వచ్చినట్లు నిర్మల తెలిపారు.
Nov 12, 2020, 1:17 pm IST
జీఎస్టీ కలెక్షన్ల రూపంలో ఎకానమీలో బలమైన రికవరీ కనిపిస్తోందని నిర్మల అన్నారు. బ్యాంక్ క్రెడిట్స్, ఎఫ్‌డీఐ ఫ్లో కూడా రికవరీని బలపరుస్తున్నాయని చెప్పారు.
Nov 12, 2020, 1:13 pm IST
జీఎస్టీ కలెక్షన్లు, పీఎంఐ వంటి సూచనలు రికవరీని సూచిస్తున్నాయని నిర్మల తెలిపారు. వివిధ రంగాల్లో రికవరీ కనిపిస్తోందన్నారు.
Nov 12, 2020, 1:12 pm IST
బలమైన రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని నిర్మల తెలిపారు. గత 10 - 15 రోజులుగా చూస్తుంటే బలమైన రికవరీ సూచనలు కనిపిస్తున్నాయని నిర్మల చెప్పారు.
Nov 12, 2020, 1:11 pm IST
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గం.1కి మీడియా ముందుకు వచ్చారు.
Nov 12, 2020, 1:00 pm IST
మధ్యాహ్నం గం.12.30కు నిర్మల మీడియా ముందుకు వస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే మధ్యాహ్నం 12.45 తర్వాత వస్తారని తెలుస్తోంది.
Nov 12, 2020, 12:51 pm IST
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీస్ మూడీస్ భారత వృద్ధి రేటును మైనస్ 9.6 శాతం నుండి 8.9 శాతానికి సవరించింది.
Nov 12, 2020, 12:45 pm IST
భారత్ టెక్నికల్‌గా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లినట్లు ఆర్బీఐ-నౌకాస్ట్‌లో ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
Nov 12, 2020, 12:23 pm IST
కేంద్రం ఎగుమతిదారుల కోసం ప్రత్యేక పథకాన్ని పరిశీలిస్తోందని, దీని కింద ఎగుమతి క్రెడిట్ బీమా పైన రూ.8వేల కోట్ల వరకు ప్రీమియం సబ్సిడీ ఇవ్వవచ్చునని వార్తలు వస్తున్నాయి.
Nov 12, 2020, 12:15 pm IST
కొన్ని రంగాలకు ప్రభుత్వం సహకారం అవసరమని, కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీపై పని చేస్తోందని ఆర్థిక కార్యదర్శి అన్నారు.
Nov 12, 2020, 12:03 pm IST
మందగించిన ఆర్థిక వ్యసవ్థ పుంజుకునేలా ఊతమిచ్చేందుకు కేంద్రం 20 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనుందని చెబుతున్నారు.
Nov 12, 2020, 11:51 am IST
కరోనా కారణంగా కొన్ని రంగాలు భారీ ఒత్తిడిలో కూరుకుపోయాయి. వీటికి ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Nov 12, 2020, 11:38 am IST
వరుసగా మూడు రోజుల పాటు సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్ గరిష్టాలను తాకాయి. నాలుగో రోజు మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ప్యాకేజీ ప్రకటిస్తే, ఆ తర్వాత మార్కెట్లలో మార్పులు ఉండవచ్చు.
Nov 12, 2020, 11:31 am IST
దీపావళి పండుగకు ముందు కేంద్రం మరో ప్యాకేజీతో ముందుకు వస్తుందని ఆర్థికవేత్తలు భావించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పలు ప్యాకేజీలతో వచ్చింది.
Nov 12, 2020, 11:31 am IST
సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల ప్యాకేజీతో ముందుకు వస్తోంది. ఏ రంగాలకు, ఎవరికి ఎంత మేర కేటాయించనున్నది నిర్మలమ్మ వెల్లడించనున్నారు.
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.