దీపావళి పండుగ సమీపిస్తున్న క్రమంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనితో పాటు పండుగ సీజన్‌లో కొనుగోలు ఉత్సాహం కూడా పెరిగి, పెట్టుబడిదారులు ఇప్పుడు భౌతిక Gold కన్నా కాగితపు బంగారం.. అంటే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoFs) వైపు తమ దృష్టిని నిలుపుతున్నారు. ఇవి భౌతికంగా లోహాన్ని కొనుగోలు చేయకుండా, పారదర్శకంగా, సురక్షితంగా బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఇస్తున్నాయి.
ఫోన్‌పే వెల్త్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ నీలేష్ డి. నాయక్ ప్రకారం.. ETFలు స్టాక్ మార్కెట్లో షేర్లలా ట్రేడ్ చేయబడతాయి. అలాగే డీమ్యాట్ ఖాతా అవసరం. ETFలు ఇంట్రాడే లిక్విడిటీని అందిస్తాయి, అంటే మీరు ఏ సమయంలోనైనా కొనుగోలు లేదా విక్రయించవచ్చు. FoFలు మాత్రం మ్యూచువల్ ఫండ్ హౌస్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి, అవి రోజుకు ఒక్కసారి నికర ఆస్తి విలువ (NAV) ఆధారంగా విలువ కట్టబడతాయని ఆయన వివరించారు.డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న, ట్రేడింగ్ చేయడంలో అనుభవం ఉన్న పెట్టుబడిదారులు ETFల ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ డీమ్యాట్ ఖాతా తెరవడానికి ఇష్టపడని లేదా సులభమైన మార్గాన్ని కోరుకునే వారు FoFలను ఎంచుకోవడం ఉత్తమం.

స్టాక్‌గ్రో వ్యవస్థాపకుడు అజయ్ లఖోటియా మాట్లాడుతూ.. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే యువ పెట్టుబడిదారులకు ETFలు మంచి ఎంపిక. వీటిలో రూ. 10 వేల వంటి చిన్న మొత్తంతో కూడా ప్రారంభించవచ్చని తెలిపారు. మరోవైపు, మ్యూచువల్ ఫండ్ తరహాలో నెలసరి SIPల ద్వారా పెట్టుబడి పెట్టే అలవాటు ఉన్నవారికి FoFలు బాగా సరిపోతాయి. అలయన్స్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ రవికుమార్ టి ప్రకారం.. చిన్న పెట్టుబడులు చేసి లిక్విడిటీని కోరుకునే వారు ETFలను ఎంచుకుంటారు. కానీ పెద్ద పెట్టుబడులు, వైవిధ్యీకరణ కోరుకునే పెట్టుబడిదారులు FoFలను ఎంచుకోవాలన్నారు.
గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని ప్రొఫెసర్ విశ్వనాథన్ అయ్యర్ ప్రకారం.. ETFలు సాధారణంగా తక్కువ ఖర్చుతో ఉంటాయి. ETFలు సగటుగా 0.25 నుంచి 0.5 శాతం ఖర్చు కలిగి ఉంటే, FoFల ఖర్చు 0.6%-1% వరకు ఉంటుందని తెలిపారు. పన్ను విధానం విషయంలో కూడా వ్యత్యాసం ఉంది. ఇక నీలేష్ నాయక్ ప్రకారం.. ETFలను 12 నెలలకంటే ఎక్కువ కాలం ఉంచితే 12.5%శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. కానీ FoFలలో దీర్ఘకాలం 24 నెలలుగా పరిగణించబడుతుందని తెలిపారు.
ETFలు తక్కువ ట్రాకింగ్ లోపాలను కలిగి ఉంటాయి.. అంటే మార్కెట్ ధరలు, నికర విలువ మధ్య తేడా తక్కువగా ఉంటుంది. FoFలలో ఈ లోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి అంతర్లీన ETFల పనితీరుపై ఆధారపడతాయి. FoFల రాబడి వాటి అంతర్గత ETFల పనితీరుపై ఆధారపడుతుంది. కానీ అదనపు ఖర్చులు, నగదు నిల్వ కారణంగా వాటి రాబడి సంవత్సరానికి 0.3 నుంచి 0.7 శాతం తక్కువగా ఉండవచ్చు. అయితే, FoFలు రోజుకు ఒక్కసారి NAV ఆధారంగా ధర నిర్ణయించడం వల్ల మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం తక్కువగా ఉంటుంది.కాబట్టి పండుగ డిమాండ్ సమయంలో, వెండి ETFలు కొన్నిసార్లు స్పాట్ ధర కంటే 10 నుంచి 12 శాతం ఎక్కువగా ట్రేడ్ అవుతాయి. కానీ FoFలు మాత్రం రోజు చివరి NAVలో మాత్రమే ధర మార్పును ప్రతిబింబిస్తాయని అజయ్ లఖోటియా పేర్కొన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications