చాలా మంది చదువులో ఫేలయితే జీవితం పోయిందనుకుంటారు. ఒక్కసారి తప్పితే మరోసారి ఛాన్స్ ఉందని మరిచిపోతుంటారు. ఇలా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యు చేసుకున్నారు. కానీ ఫేలయిన తర్వాత పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. అంతేకాదు పెద్ద పెద్ద వ్యాపారులు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చదువులేని వారు కూడా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే.. ప్రముఖ ఔషధ కంపెనీల్లో ఒకటైన దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీ దివి కూడా 12వ తరగతిలో రెండుసార్లు తప్పారు.
అయినా ప్రయత్నం ఆపకుండా విజయం సాధించారు. తన భవిష్యత్ నిర్మించుకోవడానికి కష్టపడి పని చేశాడు. హైదరాబాద్ లో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఆయన ప్రపంచంలోని అత్యంత ధనిక శాస్త్రవేత్తలలో ఒకడిగా నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం మురళీ దివి నికర విలువ దాదాపు రూ. 53,000 కోట్లు (USD 6.4 బిలియన్లు). యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల (API) మొదటి మూడు తయారీదారులలో ఒకటైన దివీస్ ల్యాబ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 97,476 కోట్లుగా ఉంది. మురళి దీవి ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చారు.

అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మురళీ దివి తండ్రి తన కుటుంబాన్ని నెలవారీ పింఛను రూ. 10,000తో నడిపించేవారు. 1976లో మురళీ దివి తన 25 సంవత్సరాల వయస్సులో US వెళ్లి ఫార్మసిస్ట్‌గా పని చేయడం ప్రారంభించారు. మురళీ దివి అమెరికా వెళ్లినప్పుడు అతని చేతిలో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోర్బ్స్ ఇండియా నివేదించింది. USలో, ట్రినిటీ కెమికల్ మరియు ఫైక్ కెమికల్స్ వంటి కంపెనీలలో పనిచేసి సంవత్సరానికి USD 65,000 సంపాదించారు. కొన్ని సంవత్సరాలు USలో పనిచేసిన తర్వాత, మురళీ దివి USD 40,000తో భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.
అయితే అప్పటికీ మురళీ దివి వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. 1984లో మురళీ దివి కల్లం అంజి రెడ్డితో చేతులు కలిపి కెమినార్‌ను నిర్మించారు. ఇది 2000లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో విలీనం అయింది. మురళీ దివి 1990లో దివీస్ లాబొరేటరీస్‌ను ప్రారంభించే కంటే 6 సంవత్సరాలు ముందు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లో పనిచేశారు. ప్రారంభంలో దివీస్ ల్యాబ్స్ APIలు, ఇంటర్మీడియట్‌ల తయారీకి వాణిజ్య ప్రక్రియలను అభివృద్ధి చేసే వ్యాపారంలోకి ప్రవేశించింది. 1995లో మురళీ దివి తెలంగాణాలోని చౌటుప్పల్‌లో తన మొదటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
2002లో విశాఖపట్నం సమీపంలో కంపెనీ రెండో తయారీ యుటిలిటీని ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన దివీస్ లాబొరేటరీస్ మార్చి 2022లో రూ. 88 బిలియన్ల ఆదాయాన్ని నివేదించింది. మురళీ దివి MIT, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. మురళీ దివి కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవంతమైన వ్యాపారిగా కొనసాగుతోన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications