Divine Power Energy IPO: దేశీయ స్టాక్ మార్కెట్లోకి నేడు అడుగుపెట్టిన రెండో స్టాక్ సైతం సంచలనమైన బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది. పెట్టుబడిదారుల డబ్బును క్షణాల్లో మూడింతలు చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లోకి అరంగేట్రం చేసిన డివైన్ పవర్ ఎనర్జీ షేర్ల గురించే. చిన్న కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన వెంటనే ఇన్వెస్టర్ల కళ్లు బైర్లుకమ్మే లాభాలను తెచ్చిపెట్టింది. మంగళవారం మార్కెట్లో డివైన్ పవర్ ఎనర్జీ షేర్లు 287 శాతానికి పైగా లాభంతో రూ.155 వద్ద లిస్ట్ అయ్యాయి. అయితే వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరును కేవలం రూ.40 ధరకు విక్రయించిన సంగతి తెలిసిందే. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ తన ఇష్యూను జూన్ 25 నుంచి జూన్ 27 వరకు తెరచి ఉంచింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్ల నుంచి నేడు రూ.22.76 కోట్లను విజయవంతంగా సమీకరించింది.

భారీ లాభకరమైన లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు ఇంట్రాడేలో నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.162.75 స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ఏకంగా తొలిరోజే కంపెనీ ఐపీవో నుంచి 300% కంటే ఎక్కువ లాభం పొందారు. ఐపీవోలో కంపెనీ షేరు ధర రూ.40 కాగా ఇప్పుడు దాని షేర్లు రూ.160 దాటాయి. డివైన్ పవర్ ఎనర్జీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ ప్లాట్‌ఫారమ్‌లో జాబితా అయ్యాయి. తాజా ఐపీవో నుంచి విజయవంతంగా సమీకరించిన నిధులను కంపెనీ తన వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
వాస్తవానికి డివైన్ పవర్ ఎనర్జీ కంపెనీ 2001లో స్థాపించబడింది. తాజా ఐపీవోలో కంపెనీ 56.90 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. తాజా ఐపీవో కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్ రూ.36-40గా నిర్ణయించింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు కనీసం రూ.1.20 లక్షల పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. అలాగే లాట్ పరిమాణాన్ని 3000 షేర్లుగా నిర్ణయించింది.
కంపెనీ బేర్ కాపర్/అల్యూమినియం వైర్, బేర్ కాపర్/అల్యూమినియం స్ట్రిప్, వైండింగ్ కాపర్/అల్యూమినియం వైర్, వైండింగ్ కాపర్/అల్యూమినియం స్ట్రిప్‌లను తయారు చేస్తుంది. వైర్లు/స్ట్రిప్‌లను ఎనియలింగ్, ఇన్సులేట్ చేయడం ద్వారా వైండింగ్ వైర్లు/స్ట్రిప్‌లు ఉత్పత్తి చేయబడతాయి. వాటిని కాగితం, పత్తి, ఫైబర్‌గ్లాస్ మొదలైన వాటితో కప్పి ఉంచుతాయి. కంపెనీ పంజాబ్, బెంగళూరు, అహ్మదాబాద్‌లోని మార్కెట్‌లకు ఫైబర్‌గ్లాస్‌తో కప్పబడిన వైర్లు/స్ట్రిప్‌లను పంపింది.


Click it and Unblock the Notifications