For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPO News: మార్చి 1న వస్తున్న ఐపీవో.. టాటా-మహీంద్రాలు ఈ కంపెనీ కస్టమర్స్..

|

IPO News: దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీవోల సందడి కనిపించి చాలా కాలం గడిచింది. 2023 ప్రారంభం నుంచి ఆర్థిక వ్యవస్థల్లోని ప్రతికూల పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ ఐపీవోలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా జాయలూక్కాస్, ఫ్యాబ్ ఇండియా తమ ఐపీవోలను రద్దు చేసుకున్నాయి.

 ధైర్యం చేసిన కంపెనీ..

ధైర్యం చేసిన కంపెనీ..

ఇలాంటి మార్కెట్ ప్రతికూలతల్లోనూ ఆటో కాంపోనెంట్ మేకర్ Divgi TorqTransfer Systems తన ఐపీవోతో మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. మార్చి 1న ఈ ఐపీవో ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి రానుంది. మార్చి 3 వరకు తెరచి ఉండనుంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఫిబ్రవరి 28న తెరవబడుతుంది. దీనికోసం కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.560-590గా నిర్ణయించింది.

 గ్రే మార్కెట్ దూకుడు..

గ్రే మార్కెట్ దూకుడు..

స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం గ్రే మార్కెట్లో ఐపీవో ధర రూ.60 ప్రీమియంతో అందుబాటులో ఉంది. అంటే ఇష్యూ ధరకు ఇది అదనపు లాభంగా చెప్పుకోవాలి. ఎవరైనా ఇన్వెస్టర్లు కంపెనీలో షేర్లను కొనుగోలు చేయాలంటే కనీసం 25 షేర్లు ఉండే లాట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు మార్చి 14న స్టాక్ క్స్ఛేంజీల్లో లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.

వాటాదారుల వివరాలు..

వాటాదారుల వివరాలు..

డివిజి టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్‌లో ఒమన్ ఇండియాకు 21.71 శాతం వాటా ఉండగా, ఎన్‌ఆర్‌జెఎన్‌కి 8.71 శాతం వాటా ఉంది. భారత్ దివ్గీకి 0.72 శాతం, సంజయ్ డిగ్గీకి 0.59 శాతం, ఆశిష్ దివ్గీకి 0.76 శాతం వాటాలు కంపెనీలో ఉన్నాయి. ఇది కాకుండా కంపెనీలో అరుణ్ ఇద్గుంజి, కిషోర్ కాల్‌బాగ్‌లకు 0.16 శాతం వాటా ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

ఆటో విడిభాగాల తయారీలో కంపెనీ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ వంటి కంపెనీలతో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లు, DCTలు, ట్రాన్ఫర్ కేసులు, టార్క్ కప్లర్‌లు, ఆటో-లాకింగ్ హబ్‌లు(ALH) మొదలైన వాటిని కంపెనీ తయారు చేస్తోంది. కంపెనీకి పూణేలోని భోసారి, కర్ణాటకలోని శివ్రే, సిర్సీలలో ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి.

English summary

IPO News: మార్చి 1న వస్తున్న ఐపీవో.. టాటా-మహీంద్రాలు ఈ కంపెనీ కస్టమర్స్.. | Divgi TorqTransfer Systems starting on march 01, 2023 know complete details

Divgi TorqTransfer Systems starting on march 01, 2023 know complete details
Story first published: Monday, February 27, 2023, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X