Disney layoffs: ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటంతో కంపెనీలు ఖర్చులను వీలైనంతగా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా సంస్థ డిస్నీ మూడో విడత తొలగింపులను ప్రారంభించింది.
తాజా విడతలో డిస్నీ 2500 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారని తెలుస్తోంది. అయితే ఏఏ విభాగాలకు చెందిన సిబ్బంది తాజా తొలగింపులతో ప్రభావితం అవుతారనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ వారంలో కొనసాగుతున్న మూడవ వేవ్ లేఆఫ్‌లు ముగియనున్నందున.. మొత్తం ఉద్యోగ కోతల సంఖ్య 6,500 దాటతాయని అంచనా వేయబడింది. ఇది గతంలో ప్రకటించిన 7000 తగ్గింపులకు దగ్గరగా ఉంది.

అక్టోబరు 1, 2022 నాటికి డిస్నీ ప్రపంచవ్యాప్తంగా 2,20,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. తాజా తొలగింపులతో మెుత్తం 3 శాతం ఉద్యోగులు కంపెనీని వీడతారని తెలుస్తోంది. దీనికి ముండు మార్చి, ఏప్రిల్ లో తొలగింపులు జరిగాయి. ముఖ్యంగా కోతలు ESPN, డిస్నీ ఎంటర్ టైన్మెంట్ విభాగం, డిస్నీ పార్క్స్ వంటి విభాగాల్లో ఎక్కువగా జరిగాయి.
ఈ తొలగింపులను అమలు చేయాలనే నిర్ణయాన్ని ఫిబ్రవరిలో వెల్లడైంది. వేసవి ప్రారంభానికి ముందు మూడు విడతలుగా సుమారు 7,000 మంది ఉద్యోగులను తగ్గించాలని మీడియా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలగింపుల ద్వారా దాదాపు 5.5 బిలియన్ డాలర్ల ఖర్చులను పొదుపు చేయాలని డిస్నీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే క్రమంలో మార్కెటింగ్ ఖర్చుల తగ్గింపు సైతం 50 శాతం మేర పొదుపుకు దోహదపడతాయని తెలుస్తోంది. ఇతర ఖర్చులను సైతం కంపెనీ తగ్గించాలని ప్లాన్ చేసుకుంది.


Click it and Unblock the Notifications