అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ భారత స్ట్రీమింగ్, టెలివిజన్ వ్యాపాలను విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం బిలియనీర్లు గౌతమ్ అదానీ, సన్ టీవీ అధినేత కళానిధి మారన్‌లతో చర్చలు జరుపుతోంది. కంపెనీ అనేక ఎంపికలను అన్వేషిస్తోందని, ఇందులో భారతీయ కార్యకలాపాలలో కొంత భాగాన్ని విక్రయించడం లేదా స్పోర్ట్స్ రైట్స్, ప్రాంతీయ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ హాట్‌స్టార్‌తో సహా యూనిట్ ఆస్తుల కలయిక వంటివి ఉండనున్నాయని బ్లూమ్ బర్గ్ నివేదిక పేర్కొంది.
బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఆస్తుల విక్రయ చర్చలు ఇప్పటికే జరిగాయి. డిస్నీ భారతదేశంలో తన వ్యాపారం కోసం పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడంతో సహా వ్యూహాత్మక ఎంపికలను పరిశీలిస్తోంది. డిస్నీ జూలైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్ 18 మీడియా ప్రైవేట్‌కి కోల్పోయింది. వయాకామ్ అనేది రిలయన్స్, పారామౌంట్ గ్లోబల్, ఉదయ్ శంకర్ పెట్టుబడి సంస్థ బోధి ట్రీ సిస్టమ్స్ మధ్య జాయింట్ వెంచర్ ఇది.

మారన్ ప్రసార సంస్థ సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ తో చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదానీ గ్రూప్ కోసం ఇది కొత్తగా కొనుగోలు చేసిన న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయిని ఏ ఒప్పందం కూడా జరగలేదని తెలుస్తోంది. డిస్నీ ఇండియా యూనిట్ విక్రయానికి సంబంధించిన చర్చలు, అంబానీ చెందిన కంపెనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి స్ట్రీమింగ్ హక్కులను $2.7 బిలియన్లకు దక్కించుకుంది.
వయోకామ్ జియో సినిమాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఉచితంగా ప్రసారం చేసింది.దీంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రభావం పడింది. చాలా మంది ఖాతాదారులను కోల్పోయింది. దీంతో ఆసియా కప్, వరల్డ్ కప్ లను డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. గతంలో క్రికెట్ ప్రసారాలలో డిస్నీ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. వయోకామ్ రాకతో.. ఇండియాలో తమ ఆస్తులను విక్రయించాలని డిస్నీ ప్రయత్నాలు చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications