Disney+ Hotstar: ఉచితాలతో వినియోగదారులను ఊరించి ప్రత్యర్థుల వ్యాపారాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవటంలో ముఖేష్ అంబానీ సిద్ధహస్తుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాధినేతకు ఇప్పుడు అదే పెద్ద చిక్కులను తెచ్చిపెడుతోంది.
జియో సినిమాలకు పోటీగా ప్రఖ్యాత ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ వాల్ట్ డిస్నీ భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి మొబైల్‌లో ఆసియా కప్ 2023, ODI క్రికెట్ ప్రపంచ కప్‌లను ఉచితంగా ప్రసారం చేస్తోంది. దీని ద్వారా కంపెనీ మళ్లీ లాభదాయకంగా మారాలని చూస్తోంది. అలాగే తన ఓటీటీ నుంచి నిష్క్రమించిన పాత వినియోగదారులతో తిరిగి కనెక్ట్ అవ్వాలని చూస్తోంది.

గత సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. అయితే మార్చి 2022 తర్వాత.. యూజర్లు వెళ్లిపోవటంతో కంపెనీకి 41.5 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో మళ్లీ లాభదాయకంగా మారాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అయితే ప్రీమియం కంటెంట్ కోసం వినియోగదారులు తిరిగి వస్తారని భావించినప్పటికీ.. అలా జరగలేదు క్రికెట్ ప్రదర్శన సమయంలో యూజర్లు సబ్‌స్క్రిప్షన్ నిలిపివేశారు. అందుకే కంపెనీ ప్రస్తుతం అంబానీకి పోటీగా నిలిచేందుకు క్రికెట్ ఉచిత ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాలని చూస్తోంది.
డిస్నీ+ హాట్‌స్టార్ క్రికెట్ మ్యాచ్‌లో వీక్షకుల సంఖ్య 50 మిలియన్లు ఉంటుందని అంచన వేస్తోంది. ఇదే జరిగితే ముఖేష్ అంబానీ JioCinema ప్లాట్‌ఫారమ్‌లోని IPL వీక్షకుల సంఖ్య కంటే ఇది 56 శాతం ఎక్కువగా ఉంటుంది. రానున్న సంవత్సరాల్లో 100 మిలియన్ల మంది వినియోగదారులను పొందుతామని కంపెనీ నమ్మకంగా ఉంది. అంబానీ ఐపీఎల్ ఉచిత ప్రసారాల దెబ్బతో జూలైలో డిస్నీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 21 మిలియన్లు తగ్గింది. డిస్నీ 2024, 2027 సంవత్సరాల క్రికెట్ హక్కులను 3 బిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసింది. టీవీ ప్రసార హక్కులను జీ 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications