Disney Hotstar: OTT లవర్స్‌కు డిస్నీ హాట్‌స్టార్ బ్యాడ్‌న్యూస్.. నెట్‌ఫ్లిక్స్ బాటలోనే..
Disney Hotstar: గతంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే జనం, ఇటీవల OTT ప్లాట్ ఫారమ్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్ వంటి కంపెనీలు ఈ స్పేస్ లో మరింత ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ఒకే అకౌంట్ ద్వారా పలువురు తమ సేవలను వినియోగించుకోవడం వల్ల OTT ప్లాట్ ఫారమ్స్ రెవెన్యూ నష్టపోవాల్సి వస్తోంది. దీనిని నివారించేందుకు స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ పై ఇటీవల ఆంక్షలు విధించింది. 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తోంది. డిస్నీ+ హాట్ స్టార్ సైతం నెట్ ఫ్లిక్స్ బాటలోనే నడవనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ప్రీమియం వినియోగదారులు గరిష్ఠంగా 10 పరికరాల్లో లాగిన్ కు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రస్తుతం అనుమతిస్తోంది. రానున్న రోజుల్లో కేవలం నాలుగు డివైసెస్ నుంచి మాత్రమే లాగిన్ కాగలిగే కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. తద్వారా పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని భావిస్తోందని తెలిపింది.
మీడియా పార్టనర్స్ ఆసియా నివేదిక ప్రకారం.. 2027 నాటికి దేశీయ స్ట్రీమింగ్ మార్కెట్ 7 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందుతుందని అంచనా. 50 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో కస్టమర్ బేస్ పరంగా హాట్ స్టార్ మార్కెట్ లీడర్ గా నిలిచిందని వెల్లడించింది. 2023 చివరి నాటికి ఈ పాలసీని అమలు చేయాలని, తద్వారా సబ్ స్క్రిప్షన్ కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications