Amazon Prime Day Deals: అమెజాన్ ప్రైమ్ డే డీల్స్ లో 80 శాతం వరకు డిస్కౌంట్..!

ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిక్ కార్ట్, అమెజాన్ సేల్స్ ఆఫర్లు ప్రకటించాయి. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ పేరుతో సేల్స్ ప్రకటించగా.. అమెజాన్ ప్రైమ్ డే డీల్స్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే డీల్స్ జూలై 4 నుంచి 6 ఉండనుంది. ప్రైమ్ మెంబర్స్ కు 72 గంటల ముందే డీల్స్ లో ఐటమ్స్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఇండియాలో ప్రైమ్ తీసుకొచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తగా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకునే వారికి ప్లాట్ రూ.500 తగ్గింపు ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కేవలం రూ.999కే లభించనుంది. కాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్లో అగ్రశ్రేణి భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో మొత్తం 500కు పైగా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రైమ్ డే సేల్స్ లో ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు, యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో పాటు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టైంట్ డిస్కౌంట్ ప్రకటించింది.

అంతేకాకుండా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో, ప్రైమ్ సభ్యులు అపరిమితంగా 5% క్యాష్‌బ్యాక్ రానుంది. ప్రైమ్ డే సేల్ లో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై రూ.15,000 డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.84,999 ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. న్‌ప్లస్ 13, ఐఫోన్ 17 సిరీస్‌పై అత్యంత ఆకర్షణీయమైన డీల్స్ కూడా ఉన్నాయి. సామ్ సంగ్ గెలాక్సి ఎం47, వన్ ప్లస్ ఎన్6 పై కూడా తగ్గింపు ఉండనుంది. స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపుతో పాటు తక్షణ బ్యాంక్ తగ్గింపులు కూడా లభించనున్నాయి. వన్ ప్లస్ నోర్జ్ 6, రెడ్మి ఏ7 ప్రొ 5జీ, ఐక్యూ 15ఆర్, వన్ ప్లస్ నోర్జ్ బడ్స్ 4 ప్రొ, శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రొపై కూడా డిస్కౌంట్లు ఉండనున్నాయి.

Amazon Price

కొత్తగా విడుదలైన బోట్ రాకెర్జ్ 650 ప్రొ, రే బ్యాన్ మెటా వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్, యాక్సెసరీలు, వేరబుల్స్, హెడ్ ఫోన్లపై 80 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. గోప్రొ హీరో 13 బ్లాక్ వంటి ప్రముఖ బ్రాండ్ కెమెరాలు, కెమెరా యాక్సెసరీలప 75 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. డెల్ 15 ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ల పై 40 శాతం వరకు , స్పీకర్లపై 60 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. శామ్ సంగ్, సోనీ, టీసీఎల్, ఎల్జీ, గ్జియోమీ వంటి ప్రముఖ బ్రాండ్ టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. అంతేకాకుండా రూ.12,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు, రూ.5,000 వరకు కూపన్ డిస్కౌంట్లు, 12 నెలల వరకు 'నో కాస్ట్ EMI' సదుపాయం కూడా ఉండనుంది.

హియర్, శామ్ సంగ్, ఎల్జీ, గోద్రెజ్, డైకిన్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల గృహోపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపు లభించనుంది. విద్యుత్ ఆదా చేసే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర పరికరాలపై వినియోగదారులు రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, రూ.17,000 వరకు ఇన్ స్టంట్ తగ్గింపు పొందవచ్చు. ఎల్జీ, శామ్ సంగ్, బోచ్, ఐఎఫ్బీ తో పాటు ఇతర బ్రాండ్ వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. ఫ్యాషన్, బ్యూటీ విభాగం దుస్తులు, పాదరక్షలు, గడియారాలు, ఆభరణాలు, లగేజీ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+