ప్రపంచవ్యాప్తంగా టెకీలకు లక్షల్లో జీతాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఏ రంగంలో ఉండని జీతాలు వారికి ఉంటాయి. ఫ్రెషర్లకు కూడా భారీ స్థాయిలో జీతాలు ఆఫర్ చేసి మరీ టెక్ కంపెనీలు తీసుకుంటూ ఉంటాయి. అయితే టెక్ కంపెనీ ఇచ్చిన ప్యాకేజీ నాకు సరిపోవడం లేదంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అవుతోంది. అతని అనుభవం తక్కువ అయినా సరే.. అతనికి భారీ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ సంతృప్తికరంగా లేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అతని అనుభవం ఎంత.. కంపెనీ ఎంత ప్యాకేజీ ఆఫర్ చేసింది వంటి వివరాలను ఓ సారి చూద్దాం..
స్టోరీ వివరాల్లోకెళితే.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కు కంపెనీ ఏడాదికి రూ. 45 లక్షల జీతం ఆఫర్ చేసింది. అయితే అతని ఉద్యోగ అనుభవం కేవలం మూడేళ్లు మాత్రమే. అయినా సరే టెక్ కంపెనీ మూడేళ్ల అనుభవానికి రూ. 45 లక్షల జీతాన్ని ఏడాదికి ఆపర్ చేస్తూ ఆఫర్ లెటర్ విడుదల చేసింది. అయితే ఆ ఉద్యోగి మాత్రం నాకు ఇది సరిపోవడం లేదు.. నన్ను కంపెనీ ఇంత తక్కువకే రిక్రూట్ ఎలా చేసుకుంటుంది..మీరు చెప్పండి అంటూ సోషల్ మీడియాలో నెటజన్ల సలహాను కోరాడు. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.

అతనికి ఇచ్చిన ప్యాకేజీలో రూ. 30 లక్షలు జీతం కాగా రూ. 3లక్షలు బోనస్, రూ. 5200 విలువైన మూడు కంపెనీ స్టాక్స్ నాలుగేళ్ల కాలానికి ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో నాకు ఈ ప్యాకేజీ సరిపోతుందా అంటూ నెటిజన్లను కోరాడు. తనకు స్టార్టప్ కంపెనీల నుండి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయని వాటిల్లోకి వెళ్లాలా దీనినే కంటిన్యూ చేయాలని అని కోరాడు. ఇతర కంపెనీలలోకి వెళ్లడానికి ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.అతను పోస్టులో ఇంకా ఏం చెప్పుకొచ్చాడంటే..ఈ ఆఫర్ నేను అంగీకరించాలా.. మాములుగా జీతాలు ఎలా ఉంటాయి. నా స్నేహితులు మాత్రం ఇది నీకు తగిన ఆఫర్, ఇంతకంటే ఎక్కువ దొరకడం కష్టం అని చెబుతున్నారంటూ పోస్ట్ ద్వారా తెలిపాడు.
అయితే మూడేళ్ల అనుభవం కలిగిన నీకు ఈ ఆఫర్ చాలా ఎక్కువని చాలామంది నెటిజన్లు అతనికి సలహా ఇచ్చారు. మరికొందరు మాత్రం మార్కెట్లో ఈ ప్యాకేజీ చాలా తక్కువని వాదించారు. నేడు టెక్ లేఆప్ కొనసాగుతున్న తరుణంలో ఉద్యోగం ఎప్పుడుు ఉంటుందో..ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి ఆఫర్ రావడం నిజంగా నీ అదృష్టం అంటూ మరికొందరు చెప్పుకొచ్చారు. మరి కొందరు ఇది ఇంజనీర్ అనుభవానికి సరిపోయేది కాదని తెలిపారు.
మరోక నెటిజన్ అయితే.. దేని వల్ల నిరాశ భాయ్.. నేను రెండు సంవత్సరాల అనుభవాన్ని పెట్టుకుని రూ. 5 లక్షల జీతం వద్దే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఆ కంపెనీ ఎక్కడుందో చెబితే నేను వెంటనే కళ్లుమూసుకుని జాయిన్ అవుతానని తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్.. నేటి ఉద్యోగుల జీతాలు, పోటీ మార్కెట్, అనుభవం గురించి తీవ్ర చర్చకు దారి తీసిందని అయితే చెప్పుకోవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications