Disa India Share: ప్రస్తుతం దేశీయంగా కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన త్రైమాసిక ఫలితాలను వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తమ పెట్టుబడిదారులకు ఊహించని రీతిలో డివిడెండ్ కూడా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఇన్వెస్టర్లకు ఊహించని రాబడిని అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దిశా ఇండియా లిమిటెక్ కంపెనీ షేర్ల గురించే. ఇది డివిడెండ్ ఆదాయం కోసం బెట్టింగ్ చేసే పెట్టుబడిదారులకు పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి. దిశా కంపెనీ ఒక్కో షేరుపై ఏకంగా రూ.100 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఈ వారంలో కంపెనీ ఎక్స్-డివిడెండ్ స్టాక్‌గా మార్కెట్లలో ట్రేడ్ అవనుంది. ప్రస్తుతం కంపెనీ షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10గా కొనసాగుతోంది.

కంపెనీ తన అర్హత కలిగిన పెట్టుబడిదారులకు రూ.100 డివిడెండ్ ఇవ్వనున్నట్లు ఫిబ్రవరి 6న స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. అంటే క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లు ఫేస్ వ్యాల్యూపై 1000 శాతం లాభం పొందుతారు. ఫిబ్రవరి 16, 2024 డివిడెండ్ కోసం రికార్డ్ డేట్ అవుతుందని దిశా ఇండియా లిమిటెడ్ తెలిపింది. అంటే ఈ తేదీ నాటికి కంపెనీ పుస్తకాల్లో షేర్లను హోల్డ్ చేసే వ్యక్తులు కంపెనీ అందించే డివిడెండ్ ఆదాయాన్ని మార్చి 6, 2024న లేదా అంతకు ముందే పొందవచ్చని తెలుస్తోంది.
2001 నుంచి కంపెనీ డివిడెండ్‌లను నిరంతరం చెల్లిస్తోంది. ఇన్వెస్టర్లకు కంపెనీ డివిడెండ్ బహుమతిని అందించడం ఇది 17వ సారి కావటం గమనార్హం. చివరిగా కంపెనీ తన పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.10 డివిడెండ్ చెల్లించింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ ధర రూ.14,900గా కొనసాగుతోంది. గడచిన ఏడాది కంపెనీ షేరు ధర ఏకంగా 91 శాతం పెరిగింది. గత నెలలో కంపెనీ షేర్లు కేవలం 2.49 శాతం మాత్రమే లాభపడ్డాయి. కంపెనీ 52 వారాల గరిష్ఠ ధర బీఎస్ఈలో రూ.17,570గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.7,600గా కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,166.84 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications